అది ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న శ్రుతి... ఎవరైనా నేర్పించండయ్యా!

First Published Apr 20, 2021, 10:11 AM IST

లివింగ్ లెజెండ్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ చాలా విషయాలలో తండ్రికి తగ్గ కూతురు. తండ్రి మాదిరే శృతి మల్టీ టాలెంటెడ్. నటనతో పాటు ఆమెకు సింగింగ్, మ్యూజిక్ కంపొజిషన్, రైటింగ్ వంటి ఆర్ట్స్ పై పట్టు ఉంది.

ముఖ్యంగా శృతి ప్రొఫెషనల్ సింగర్ కాగా, పలు అంతర్జాతీయ షోలలో తన గళం విప్పారు. వెస్ట్రెన్ మ్యూజిక్ లో విదేశాలలో స్టేజ్ షోలు ఇస్తుంది శ్రుతి హాసన్. దీనితో పాటు తండ్రి నుండి మరో గొప్ప లక్షణాన్ని శృతి పుణికి  పుచ్చుకున్నారు.
undefined
కమల్ హాసన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. పాత్రకు తగ్గట్టు శరీరాకృతిని కూడా మార్చుకోవడానికి సిద్దపడే నటులలో కమల్ ది మొదటి స్థానం. శృతి కూడా అదే పంథా ఫాలో అవుతూ ఉంటారు.
undefined
కాగా శృతి ప్రస్తుతం ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది.
undefined
మొదటి షెడ్యూల్ తెలంగాణా రాష్ట్రము లోని గోదావరి ఖని మైనింగ్ ఏరియాలో చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ నందు శృతి హాసన్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ మూవీలో శృతి జర్నలిస్టు రోల్ చేస్తున్నారట. అవినీతి పరుల రంగు బయటపెట్టడానికి స్టింగ్ ఆపరేషన్స్ కూడా చేస్తారని వినికిడి.
undefined
అయితే ఈ పాత్రలో పర్ఫెక్షన్ కోసం శృతి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారట. నిజమైన జర్నలిస్ట్స్ బాడీ లాంగ్వేజ్, ప్రవర్తనా తీరు, విషయాలపై వారు స్పందించే విధానాన్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు అట.
undefined
దీని కోసం కొందరు జర్నలిస్ట్స్ ని ఆమె కలిసి, విషయాలు సేకరిస్తున్నారని మీడియా వర్గాల సమాచారం.  ఏదో సెట్ కి వెళ్ళామా, డైరెక్టర్ చెప్పింది చేసి వెళ్లిపోయామా అన్నట్లు కాకుండగా, శృతి పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధం కావడం మెచ్చుకోదగ్గ విషయమే.
undefined
ఆమధ్య శృతి సినిమాలకు స్వల్ప విరామం ప్రకటించారు. బ్రేక్ తరువాత ఆమె చేసిన క్రాక్, వకీల్ సాబ్ హిట్ టాక్ అందుకున్నాయి. సలార్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసి, శృతి మరలా రేసులోకి వచ్చింది.
undefined
click me!