అలాగే పలువురు హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ గురించి తమ అభిప్రాయం తెలియజేయడం జరిగింది. కొందరు అసలు అలాంటిది ఏమీ లేదని సమర్ధించగా, కొందరు హీరోయిన్స్... ఉంది, కాకపోతే అది మన నిర్ణయంపై, ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
annapoorna
annapoorna తాజాగా సీనియర్ నటి, టాలీవుడ్ అమ్మ అన్నపూర్ణగారు క్యాస్టింగ్ కౌచ్ గురించి తన అభిప్రాయం వెల్లడించారు. యుక్త వయసులోనే పరిశ్రమకు వచ్చిన అన్నపూర్ణ, అమ్మగా వయసుకు మించిన పాత్రలు చేయడం జరిగింది .
annapoorna
అన్నపూర్ణ అసలు పేరు ఉమ అట. నాటకరంగంతో తన నటనా జీవితం మొదలుకాగా, వెండితెరపై కథానాయికగా, అమ్మగా ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశానని అన్నపూర్ణ తెలియజేశారు. తన తోటి నటులు, దర్శక నిర్మాతలు ఎంతగానో గౌరవం ఇచ్చేవారని అన్నపూర్ణ అన్నారు.
undefined
క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. తప్పు అనేది ప్రతిసారి ఒకరివైపే ఉండదని, ఇద్దరి ప్రమేయం ఉన్నప్పుడే తప్పు జరుగుతుంది అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ ఒక అనవసరపు వ్యవహారం. ప్రతి రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది.
undefined
కుటుంబం, గౌరవం వంటివి దృష్టిలో ఉంచుకొని మహిళలు, ఆ వేధింఫుల నుండి తప్పించుకొని వస్తున్నారు. అలాగే పరిశ్రమలో ఉన్న ఆడవాళ్లు కూడా తప్పించుకు తిరగాలి అన్నారు.
undefined
ఇక ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే వెంటనే స్పందించాలి, మాట్లాడాలి. పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారికి, ఈ వేధింపులు ఎక్కువగా ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అన్నారు.
undefined
అలాగే తప్పు జరిగిన ప్రతిసారి ఒక్కరినే నిందించలేం. ఓ సంఘటన వెనుక నిజానిజాలు తెలుసుకోవాలని అన్నపూర్ణ తెలియజేశారు. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అని, పరోక్షగా అన్నపూర్ణ తెలియజేశారు.
undefined
దాదాపు మూడు దశాబ్దాలుగా అన్నపూర్ణ వెండితెరపై నటిగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఆమె వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు
undefined
ఎఫ్ 2లో నటించి మెప్పించిన అన్నపూర్ణ, ఎఫ్ 3లో కూడా నటిస్తున్నారని సమాచారం.
undefined