Devatha: ఆదిత్య రుక్మిణి బంధాన్ని చూసి అసహ్యంగా ఉహించుకుంటున్న సత్య!

First Published Oct 7, 2022, 1:28 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 7వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..సత్య ఆదిత్యతో, క్యాంపు బాగా జరిగిందా అని అడుగుతుంది. బానే జరిగింది అని ఆదిత్య అనగా,ఇక్కడకి వెళ్లారు అని వివరాలు అడుగుతుంది సత్య కానీ వివరాలు ఆదిత్య చెప్పడు. నాకు తెలుసు ఆదిత్య నువ్వు దీని గురించి మాట్లాడవు, పోనీ నేను చెప్పనా అక్కడ ఏం జరిగిందో అని ఫోటో చూపిస్తుంది. నువ్వు నన్ను కాదు అని అక్కతో కదా వెళ్లావు. అసలు నీ మనసులో ఏముంది ఆదిత్య. ఇన్ని రోజులు నువ్వు ఏదో తెలియని బాధకు గురవుతున్నావు అని నేను బాధపడ్డాను.
 

కానీ నీ బాధంతా దీనికోసం అని నేను అనుకోలేదు అని అనగా ఆదిత్య, అది కాదు సత్య నీకు చెబుదామనుకున్నాను అని అంటాడు. దానికి సత్య, ఏం చెప్తావ్ జానకమ్మ గారికి ఒంట్లో బాలేదు అని అక్కడికి తీసుకెళ్దాం అని నాకు చెప్తే నేను బాధపడతాను అని నువ్వు నాకు చెప్పలేదు అంటావు.అంతేనా? నువ్వు వెళ్ళినందుకు కూడా నేను బాధపడడం లేదు ఆదిత్య, భార్యతో కూడా అబద్ధం చెప్పి వెళ్లాల్సిన పని ఏంటి వాళ్ళు అంత ఎక్కువైపోయారా చి! అని చెప్పి వెళ్ళిపోతుంది సత్య. అప్పుడు ఆదిత్య అలా మంచం మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు.
 

మరోవైపు జానకమ్మకు వైద్యం చేస్తున్న డాక్టర్,ఈవిడకి ఎంత ట్రీట్మెంట్ చేసిన స్పందన ఇవ్వడం లేదు. ఏదో దీర్ఘ ఆలోచనలలో ఉంటున్నారు అసలు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు కూడా ఆవిడకు తెలియట్లేదు. ఎంత బాధగా ఉన్న మనిషైనా ప్రకృతి చికిత్సలయానికి వస్తే, ఈ వాతావరణ కి కొంచెం ప్రశాంతంగా ఉంటారు. కానీ ఈవిడ మనసు ఆందోళన చెందుతుంది ఇళ్లు వదిలి బయటకు రావడం ఈవిడికి నచ్చడం లేదా అని అనుకుంటారు. అయితే రుక్మిణి, అలాగే జరిగి ఉంటుంది.ఎప్పుడూ ఇల్లు దాటి అమ్మ బయటకు కదల్లేదు అని అనగా, అయితే మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి.
 

నేను మీకు మందులు ఇస్తాను నేలపాటు సరిపడగా మందులు మీరు వేస్తే సరిపోతుంది.జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు. దానికి పక్కనున్న నర్సు, మీరు తీసుకెళ్లిపోవడమే మంచిదమ్మా మీ చేతులారా మీరు మందులు ఇస్తేనే మీకు ధైర్యంగా ఉంటుంది. ఆ మాధవ సార్ అడ్డురారు కదా అని అనగా,ఇంటికి తీసుకెళ్లడమే మంచిది అనుకుంటుంది రుక్మిణి.మరోవైపు సత్య కూర్చొని ఆలోచిస్తూ ఉండగా దేవుడమ్మ సత్య దగ్గరకి వచ్చి, ఆదిత్య కు వెళ్లి పాలు ఇవ్వమని చెప్తుంది. సత్య అక్కడికి వెళ్తుంది కానీ మౌనంగా ఉంటుంది. ఆదిత్య,సత్య ని చూసి కూడా పాలు తీసుకోకుండా లాప్టాప్ లో పని చేస్తూ ఉంటాడు.

 అప్పుడు దేవుడమ్మ అక్కడికి వచ్చి, అసలు మీరిద్దరూ ఏం చేస్తున్నారు పాలు తీసుకొ అని అడగకుండా సత్య.సత్యను చూసి కూడా తీసుకోకుండా నువ్వు. పాండిచ్చేరి రాకుండా క్యాంప్ కి వెళ్ళాడని అంత బాధ పడుతున్నావా ఎందుకు ప్రతి విషయాన్ని అంత కోపంగా తీసుకుంటున్నావ్ సత్య అని సత్య తో, ఆదిత్య నువ్వైనా సత్య మనుసులో ఏమున్నదో ఆలోచించాలి కదా?రేపు దసరాకి అమ్మవారి గుడికి మీ ఇద్దరినీ తీసుకొని వెళ్లి మీ చేత ముత్తైదువులందరికి వాయినాలు ఇప్పిస్తాను. అప్పటికైనా మీ ఇద్దరి మధ్య దూరం తగ్గుతుందేమో అని అక్కడ నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది దేవుడమ్మ.
 

బైటకు వచ్చి, చాలా బాధపడుతుంది. వీళ్లిద్దరి మధ్య దూరం పెరుగుతున్నట్టు ఉన్నది ఏం చేయాలి అని అడగగా దేవుడమ్మ భర్త అక్కడికి వచ్చి, భార్యాభర్తలు అన్నాక గొడవలు ఉంటాయి కదా అని అంటాడు.దానికి దేవుడమ్మ, అలా కాదు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటో నాకు అర్థం కావడం లేదు.వేళ్ళని మళ్ళీ ఎలాగైనా కలపాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో రుక్మిణి జానకమ్మ దగ్గరికి వస్తుంది. మీరేం భయపడొద్దు రేపు మనం ఇంటికి వెళ్తున్నాము అక్కడే మీకు నయం అవుతుంది అని అనగా జానకమ్మ వద్దు అన్నట్టు సాయిగ చేస్తుంది. దేవి,చిన్మయి లు అక్కడికి వస్తారు.
 

 అప్పుడు జానకమ్మ, దేవి వైపు చూస్తూ, తీసుకెళ్లిపో అని సైగలు చేస్తుంది. అప్పుడు విషయం అర్థం చేసుకున్న రుక్మిణి,పిల్లలు ఇద్దరుని,రేపు బయలుదేరుతున్నాం కదా బట్టలు సర్దుకోండి అని పంపించేసి,జానకమ్మ తో, మీరు ఏమంటున్నారో నాకు అర్థమవుతుంది. నన్ను, దేవిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు కానీ మిమ్మల్ని ఇలా వదిలి నేను వెళ్ళను. మీకు తగ్గిన తర్వాతే నేను వెళ్తాను లేకపోతే మీరు నాకు ఇన్ని రోజులు చేసిన సహాయానికి అర్థం ఉండదు.ఆ మాధవ్ గారు ఏం చేసినా సరే నేను అడ్డుకుంటాను.
 

 మీకు నయమైన వెంటనే బయలుదేరుతాను అని అనగా, వెనకాతల నుంచి ఈ మాటలు వింటున్న మాధవ్, అమ్మకు నయమయ్యే వరకు రాద ఇక్కడే ఉంటుంది కనుక రాద గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా ఏవైనా మంచి ప్లాన్ వేయాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత రోజు దేవుడమ్మ కుటుంబం అంతా గుడికి వెళ్ళడానికి బయలుదేరుతారు. అప్పుడు ఆదిత్య,సత్య ఇద్దరు ఒక కారులో వెళ్తూ ఉండగా,ఆదిత్య కు ఫోన్ వస్తుంది. మై లైఫ్ అని సేవ్ అయ్యి ఉంటుంది. సత్య ఆశ్చర్యపోయి ఫోన్ ఎత్తగా, పెనిమిటి మేము ఇంటికి వచ్చేసాము,జానకమ్మ గారికి ఇంట్లోనే వైద్యం చేస్తారట అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!