సమంత అనుమానాస్పద ప్రవర్తన, ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం ఏది? ఎన్నాళ్లీ సస్పెన్స్?

First Published Sep 3, 2021, 12:40 PM IST


సమంత మనసులో ఇప్పుడు ఏం నడుస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే సమంత ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ తెలిసే అవకాశం కలదు. 


కొద్దిరోజులుగా సమంత మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. సమంత వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. సమంత, భర్త నాగ చైతన్యకు మధ్య మనస్పర్థలు వచ్చాయని, నాగార్జున ఫ్యామిలీకి సమంత దూరం అయ్యారని సదరు వార్తల సారాంశం. సామ్, చైతుల గొడవ విడాకుల వరకు వెళ్లిందని కూడా వార్తలు వెలువడ్డాయి. 

నిప్పు లేకుండా పొగ రాదంటారు. మీడియా కథనాలలో ఎంతో కొంత నిజం ఉంది అనేది కొందరి వాదన. మీడియా కథనాలకు రుజువుగా సమంత ప్రవర్తనలో వచ్చిన మార్పు, ఆమె చర్యలను చూపుతున్నారు. నిజంగా కొన్నాళ్లుగా సమంత ప్రవర్తన అనుమాస్పదంగా ఉంది. ఆమె వివరణ ఇవ్వాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 
 

మొదటిగా సమంత సడన్ గా సినిమాలకు బ్రేక్ ఎందుకు ప్రకటించారు? పెళ్లి తరువాత కూడా బిజీ హీరోయిన్ గా పలు చిత్రాలు చేసిన సమంత విరామం ప్రకటించడం అనుమానాలు రేకెత్తిస్తుంది. దీనికి సమంత సోషల్ మీడియాలో వివరణ ఇచ్చినా, నమ్మ శక్యంగా లేదు. 


సోషల్ మీడియాలో సమంత పేరు మార్చుకోవడం పెద్ద చర్చకు దారి తీసింది. నాగ్ ఫ్యామిలీతో ఆమెకు విబేధాలు తలెత్తాయనే అనుమానాలకు బీజం పడింది ఇక్కడే. తన పేరు నుండి ఇంటిపేరు అక్కినేని తొలగించిన సమంత.. జస్ట్ లెటర్ 'ఎస్' ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ నేమ్ గా మార్చుకున్నారు. 

అలాగే ఇటీవల నాగార్జున 62వ బర్త్ డే జరుపుకున్నారు. నాగార్జునకు సోషల్ మీడియా ద్వారా బెస్ట్ విషెష్ చెప్పారు సమంత. అయితే నాగ్ బర్త్ డే వేడుకలకు ఆమె హాజరు కాలేదు. సమంత మినహా మిగతా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. సమంత ఇంత పెద్ద వేడుకను ఎందుకు స్కిప్ చేసింది, అది కూడా ఖాళీగా ఉంటూ. ఇదొక సమంత అనుమానాస్పద చర్య. 

సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తన క్లోజ్ ఫ్రెండ్స్ తో ఆమె విహారానికి వెళ్లడం జరిగింది. ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి సమంతకు బెస్ట్ ఫ్రెండ్ కాగా, ఆమె కుటుంబంతోనే ప్రస్తుతం సమంత వెకేషన్ కి వెళ్లినట్లు సమాచారం. కానీ ఈ వెకేషన్ లో చైతూ పాల్గొనలేదు. చైతూను అవాయిడ్ చేసి సమంత సోలోగా వెకేషన్ కి ఎందుకు వెళ్లారనేది మరో ప్రశ్న. 

చివరిగా మీడియా ఎంతగా ఈ టాపిక్ పై సమంత అభిప్రాయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నా ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. చైతూ, నాగ్ ఫ్యామిలీతో తనకు ఎటువంటి గొడవలు లేవని క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ విషయాలను పక్కదారి పట్టిస్తూ.. నాకు సమాధానం చెప్పాలని లేదని అంటున్నారు. ఇవన్నీ గమనిస్తుంటే.. నాగ్ ఫ్యామిలీతో సమంతకు కోల్డ్ వార్ నడుస్తుందని అనిపిస్తుంది. సమంత నోరు విప్పకపోయినా ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. 

click me!