ముంబయిలో లగ్జరీ ఫ్లాట్‌ కొన్న సమంత.. రేట్‌ తెలిస్తే మైండ్‌ బ్లాకే.. అక్కడే సెటిల్‌?

Published : Feb 08, 2023, 05:39 PM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తుంది. చూడబోతుంటే టాలీవుడ్‌కి గుడ్‌ బై చెప్పి బాలీవుడ్‌కి పరిమితం కాబోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.   

PREV
16
ముంబయిలో లగ్జరీ ఫ్లాట్‌ కొన్న సమంత.. రేట్‌ తెలిస్తే మైండ్‌ బ్లాకే.. అక్కడే సెటిల్‌?

సమంత.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత బోల్డ్ డెసీషన్స్ తీసుకుంటుంది. బోల్డ్ గా ఫోటో షూట్లు చేసి ఆకట్టుకుంది. అదే సమయంలో తన పర్సనల్‌ విషయాల్లోనూ చాలా మార్పులు చేసుకుంటుంది. అందులో భాగంగా ఆమె ముంబయికి మకాం మార్చబోతుంది. గతంలో ఈ బ్యూటీ ముంబయికి షిఫ్ట్ అయినట్టు వార్తలొచ్చాయి. చాలా రోజులుగా అక్కడే ఉంటోంది. అంతేకాదు మేనేజర్‌ని కూడా మార్చేసింది. ముంబయి బేస్డ్ మేనేజర్‌ని ఎంచుకుంది. 
 

26

ఇప్పుడు పూర్తిగా ముంబయికి షిఫ్ట్ అవుతుందని సమాచారం. ఇకపై ముంబయిలో ఉండేందుకు ప్లాన్‌ చేసుకుంటుందట. అక్కడ సమంత కొత్తగా ఇళ్లుని కొనుగోలు చేసిందని తెలుస్తుంది. ముంబయిలోని సెలబ్రిటీలు నివసించే పాష్‌ ఏరియాలో త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ కొనుగోలు చేసిందట. త్వరలోనే అందులోకి సమంత షిఫ్ట్ కానుందని సమాచారం. 
 

36

ఇదిలా ఉంటే దాని కాస్ట్ వివరాలు ఇప్పుడు లీక్‌ అయ్యాయి. బాలీవుడ్‌ మూవీ సమాచారం మేరకు సమంత ఏకంగా రూ.15కోట్లు పెట్టి త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ కొనుగోలు చేసిందట. చాలా లగ్జరీగా ఈ ఫ్లాట్‌ ఉండబోతుందని సమాచారం. అంతేకాదు అక్కడ నుంచి వ్యూ పాయింట్‌ బాగుంటుందని తెలుస్తుంది. సమంత ఇటీవల సన్ సెట్ ని ఎంజాయ్ చేస్తూ అభిమానులతో ఇన్ స్టా వేదికగా పంచుకున్న ఓ ఫొటో అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. 
 

46

సమంత ప్రస్తుతం తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటించింది. ఇది పాన్‌ ఇండియా మూవీ. ఈ సినిమా వాయిదా పడింది. ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది. దీంతోపాటు విజయ్‌ దేవరకొండతో `ఖుషి` సినిమా చేయబోతుంది. వచ్చే నెల నుంచి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది. కొత్తగా తెలుగులో సమంత మరే సినిమాకి సైన్‌ చేయలేదు. కానీ హిందీలో మాత్రం మూడు నాలుగు కమిట్‌మెంట్స్ ఉన్నాయి. నెమ్మదిగా అవి ప్రకటించబోతుంది. 

56

ప్రస్తుతం ఆమె హాలీవుడ్‌ పాపులర్‌ సిరీస్‌ `సిటాడెల్‌` హిందీ రీమేక్‌లో నటిస్తుంది. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ఇది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో ప్రస్తుతం సమంత పాల్గొంటుంది. దీని తర్వాత ఆమె బాలీవుడ్‌ సినిమాలను స్టార్ట్ చేయనుందని సమాచారం. 
 

66
Samantha

హైదరాబాద్‌లో ఉంటే తన పాతజ్ఞాపకాలు, నాగచైతన్యకు సంబంధించిన గుర్తులు గుర్తొచ్చేఅవకాశం ఉంది. వాటిని పూర్తి మర్చిపోయి, కొత్త లైఫ్‌ని లీడ్‌ చేసేందుకు సమంత ఇలా ముంబయికి మకాం మారుస్తున్నట్టు సమాచారం. అంతేకాదు సినిమాలు కూడా బాలీవుడ్‌లోనే ఎక్కువగా చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటుందని భోగట్టా. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories