సమంత, అనుష్క, కీర్తి, తమన్నా, సాయి పల్లవి.... స్టార్ హీరోయిన్స్ డీగ్లామర్ లుక్స్ చూస్తే మతిపోవాల్సిందే!

First Published Jun 9, 2021, 4:02 PM IST

కమర్షియల్ హీరోయిన్ గా ఎదిగాక డీగ్లామర్ రోల్ చేసే అవకాశం రావడం చాలా కష్టం. చాలా అరుదుగా నటనకు ఆస్కారం ఉండే ఢీ గ్లామర్ రోల్స్ దక్కించుకుంటారు తారలు. స్టార్ హీరోయిన్స్ గా వెలిగిపోతున్న తమన్నా, అనుష్క, సమంత, కీర్తి, సాయి పల్లవి, ప్రియమణి  వంటి స్టార్స్ డీగ్లామర్ రోల్స్ చేశారు. స్టార్ హీరోయిన్స్ డీగ్లామర్ లుక్స్ పై ఓ లుక్ వేయండి.
 

టాలీవుడ్ లక్కీ లేడీ సమంత కెరీర్ లో రెండే సార్లు డీగ్లామర్ రోల్ చేశారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం మూవీలో రామలక్ష్మిగా సమంత డీగ్లామర్ రోల్  చేయడం జరిగింది. తాజాగా విడుదలైన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో సమంత టెర్రరిస్ట్ గా డీగ్లామర్ రోల్ చేశారు. ఈ రెండు పాత్రలు సమంతకు పేరు తెచ్చిపెట్టాయి.
undefined
స్వీటీ అనుష్క ఇండియాస్ బడా బ్లాక్ బస్టర్ బాహుబలి సిరీస్ లో డీగ్లామర్ రోల్ చేయడం జరిగింది. దారుణమైన శిక్ష అనుభవించే బాహుబలి భార్యగా అనుష్క డీగ్లామర్ లుక్ భయం గొలిపేదిగా ఉంటుంది. అనుష్క లాంటి అందగత్తెను ఫ్యాన్స్ అలా చూడలేకపోయారు.
undefined
మహానటి కీర్తి సురేష్ సైతం డీగ్లామర్ రోల్స్ చేయడం జరిగింది. ఆమె డెబ్యూ వెబ్ మూవీ పెంగ్విన్ లో ఆమె డీగ్లామర్ రోల్ చేశారు. అయితే విడుదలకు సిద్ధంగా ఉన్న గుడ్ లక్ సఖి మూవీలో ఆమె పూర్తి స్థాయి డీగ్లామర్ రోల్ చేయడం జరిగింది.
undefined
మిల్కీ బ్యూటీ తమన్నా సైతం బాహుబలి మూవీలో డీగ్లామర్ రోల్ చేశారు. రాజుకు వ్యతిరేకంగా పోరాడే ఉద్యమ దళం యువతిగా ఆమె డీగ్లామర్ రోల్ చేయడం జరిగింది. బాహుబలి మొదటి భాగంలో తమన్నా పాత్ర ఆకట్టుకుంది.
undefined
మరో స్టార్ హీరోయిన్ ప్రియమణి రెండు మూడు సినిమాలలో డీగ్లామర్ రోల్ చేశారు. ఆమెకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పరుత్తివీరన్ మూవీలో ఆమె డీగ్లామర్ రోల్ చేశారు. అలాగే రావణ్ మూవీలో కూడా చేశారు. తెలుగులో ప్రియమణి నటిస్తున్న విరాటపర్వం, నారప్ప సినిమాలలో డీగ్లామర్ రోల్స్ చేస్తున్నారు.
undefined
ఇక నాచురల్ బ్యూటీ సాయి పల్లవి విరాట పర్వం మూవీలో 90ల నాటి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి కూడా డీగ్లామర్ రోల్ చేస్తున్నారు.
undefined
click me!