చిన్నారిగా సాయిపల్లవి ఎంత క్యూట్‌గా ఉందో..బర్త్ డే బేబీ పేరులోని అసలు సీక్రెట్‌ తెలిసిపోయింది..!

Published : May 09, 2021, 02:46 PM IST

సాయిపల్లవి ఓవర్‌ నైట్‌ స్టార్‌. హీరోయిన్‌గా రాణించేందుకు ఎక్స్ పోజింగ్‌ చేయాలనే బారియర్స్ ని బ్రేక్‌ చేసిన నటి. అద్భుతమైన నటన, అత్యద్భుతమైన డాన్స్ లతో  `ఫిదా` చేయగలనని నిరూపించింది. వాటితోనే స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది.   

PREV
115
చిన్నారిగా సాయిపల్లవి ఎంత క్యూట్‌గా ఉందో..బర్త్ డే బేబీ పేరులోని అసలు సీక్రెట్‌ తెలిసిపోయింది..!
మే9 నేడు(ఆదివారం) సాయిపల్లవి తన 29వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. కరోనా సమయంలో ఇంటికే పరిమితమైన ఈ అమ్మడు నిరాడంబరంగానే తన బర్త్ డే వేడుక జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సాయిపల్లవికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ముఖ్యంగా ఆమె సాయిపల్లవి ఎందుకు పెట్టుకుందో తెలిసిపోయింది. మరోవైపు చిన్ననాటి చిత్రాలు వైరల్‌ అవుతున్నాయి.

215
సాయిపల్లవి బర్త్ డే సీడీపీ.
సాయిపల్లవి బర్త్ డే సీడీపీ.
315
సాయిపల్లవిది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోటగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరుకి ముందు సాయిని చేర్చారు. ఈమె, చెల్లెలు పూజ కవల పిల్లలు. కోయంబత్తూరు లో పాఠశాల విద్యనభ్యసించింది

415
తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. ఎనిమిదో తరగతిలో ఉండగా ఈమె నాట్యం చూసిన ఓ దర్శకుడు `ధూం ధాం` అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు.

515
సాయిపల్లవి చిన్నప్పటి నుంచి చాలా చురుకైన అమ్మాయి. మొదట ఆమె తెలుగులో ఈటీవీలో వచ్చే `ఢీ` షోలో పాల్గొనేందుకు ప్రయత్నించారట. కానీ పేరెంట్స్ ఒప్పుకోలేదని, స్టడీ దెబ్బతింటుందని నో చెప్పారట. కానీ ఆ తర్వాత `ఢీ` జోడి ఆడిషన్స్ కి వెళ్లినప్పుడు తన డాన్స్ చూసి అందరు ఫిదా అయ్యారు. అలా ఎంపికైన సాయిపల్లవి `ఢీ` నాల్గో సీజన్‌లో దుమ్మురేపారు. అప్పటి నుంచి డాన్సుల్లో తన ప్రత్యేకత చాటుకున్నారు.

615
తర్వాత మీరా జాస్మిన్ క్లాస్మేట్గా కస్తూరి మాన్ అనే మరో సినిమాలో నటించింది. ఇలా వరుస సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. తండ్రి సలహా మేరకు జార్జియాకి వెళ్లి వైద్యవిద్యను అభ్యసించింది.

715
తమిళ దర్శకుడు అల్ఫోన్సో తెరకెక్కించిన `ప్రేమమ్` చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఇందులోని ఆమె డాన్స్ లకు సౌత్‌ మొత్తం ఫిదా అయ్యింది.

815
మలయాళంలో నటించిన `ప్రేమమ్‌` చిత్రంతో పాపులర్‌ అయ్యింది సాయిపల్లవి. ఇందులో కాలేజ్‌ దశలో టీచర్‌గా ఆడియెన్స్ ని ఫిదా చేసింది. మలయాళంలోనే కాదు సౌత్‌లోనూ పాపులర్‌ అయ్యింది. అయితే `ప్రేమమ్` సినిమా కోసం ఆల్ఫోన్స్ ఆమెను సంప్రదించినప్పుడు... ఆమె తీవ్ర ఒత్తిడికి గురైందట.

915
ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగులో `ఫిదా` సినిమా చేసింది. ఇందులో అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది పల్లవి. ఈ సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఫిదా చేసింది.

1015
ఈ `ఫిదా` బ్యూటీకి చాలా బిడియం ఉంటుందట. కెమెరా ముందు నటించాలంటే మొదట్లో చాలా భయపడేదట. క్రమంగా దాన్నుంచి బయటపడింది. ఇప్పుడు చాలా సన్నివేశాలను ఒకే టేక్‌లో ఓకే చేయించుకుంటున్నారని టాక్‌.

1115
ఆ తర్వాత నానితో `ఎంసీఏ`తో విజయాన్ని అందుకుంది. తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ హీరోగా నటించిన`మారి-2`తో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకు కోలీవుడ్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పొచ్చు.

1215
`మారి 2`లోని `రౌడీ బేబీ` సాంగ్‌ సంచలనం సృష్టించింది. ఈ పాట 1.14బిలియన్స్ కిపైగా వ్యూస్‌ని సాధించి రికార్డు సృష్టించింది.

1315
ఇక తెలుగులో ఈ బ్యూటీ ఇటీవల నటిస్తున్న `లవ్‌ స్టోరి` చిత్రంలోని `సారంగ దరియా` సైతం సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. వంద మిలియన్స్ కి పైగా వ్యూస్‌ని రాబట్టి దూసుకుపోతుంది. `ఫిదా` చిత్రంలోని `వచ్చిండే` పాట ఇప్పటికే మూడు వందల మిలియన్స్ ని దాటేసింది.

1415
టాలీవుడ్‌లో ఈ అమ్మడికి `ఎంసీఏ` తర్వాత విజయాలు దక్కలేదు. ప్రస్తుతం `విరాటపర్వం`లో వెన్నెలగా హీరోకి లవ్‌ ఇంట్రెస్ట్ గా నటిస్తుంది. అలాగే `లవ్‌ స్టోరి` చిత్రంలో చైతూ సరసన నటిస్తుంది. దీంతోపాటు నానితో కలిసి `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంలో నటిస్తుంది. తాజాగా విడుదలైన ఆమె ఫస్ట్ లుక్‌ ఆకట్టుకుంటోంది.

1515
ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి తన చర్మం గురించి చెప్పుకోచ్చింది. మొదట్లో పింపుల్స్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని.. తీవ్ర ఒత్తిడికి గురయ్యానని చెప్పుకోచ్చింది. అయితే ఇప్పుడు సాయిపల్లవి ముఖంపై ఉన్న పింపుల్సే చాలా వరకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories