అప్పుడు దేవుడమ్మ పాప చెవిలో పేరు చెప్పబోతుండగా దేవి ఆ పాప పేరు ఏంటో నాకు చెప్పండి అని అంటుంది. ముందు పాపకి చెప్పిన తర్వాతే మీకు చెప్తాను అని దేవుడమ్మ అంటుంది.ఆ తర్వాత దేవుడమ్మ పాప చెవిలోకి రుక్మిణీ అని మూడుసార్లు అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ పాపకి ఏం పేరు పెట్టారు అని అనగా మీకు నచ్చిన, పేరు నాకు నచ్చిన, పేరు ఇంట్లో ప్రతిరోజు వినబడబోయే పేరు మన రుక్మిణి పేరే పెట్టాను అని అంటుంది. ఇంట్లో వాళ్ళ అందరితో పాటు రుక్మిణి కూడా ఎంతో ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది. అప్పుడు కమల మంచి పేరు పెట్టారు అని అంటుంది.