రామ్‌ చరణ్ కోసం శ్రీహరి స్పెషల్‌ కేర్‌.. `మగధీర` షూటింగ్‌లో రియల్ స్టార్‌ ఏం చేశాడో తెలుసా?

Published : May 04, 2024, 04:23 PM IST

రియల్‌ స్టార్‌గా తెలుగు ఆడియెన్స్ ని అలరించిన శ్రీహర.. రామ్‌ చరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కోసం `మగధీర` సమయంలో ఏం చేశాడో తెలిపారు. రేర్‌ వీడియో వైరల్‌ అవుతుంది.  

PREV
18
రామ్‌ చరణ్ కోసం శ్రీహరి స్పెషల్‌ కేర్‌.. `మగధీర` షూటింగ్‌లో రియల్ స్టార్‌ ఏం చేశాడో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో రియల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు శ్రీహరి. విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మెప్పించారు. ఇండస్ట్రీలో శ్రీహరి పోషించే పాత్రలు విభిన్నం. ఆయన లేని లోటు ఇప్పటికీ పూర్చే వారు లేదంటూ అతిశయోక్తి కాదు. ఓ బలమైన సైడ్‌ క్యారెక్టర్‌కి ఇప్పటికీ లోటు ఉంది. ఆయన స్పేస్‌ అలానే మిగిలిపోయింది. 
 

28

అలా తనకంటూ ఓ డిఫరెంట్‌ స్పేస్‌ని క్రియేట్‌ చేసుకుని స్వతహాగా ఎదిగారు రియల్‌ స్టార్‌ శ్రీహరి. స్టంట్‌ ఫైటర్‌గా ఆయన కెరీర్‌ని ప్రారంభించారు. జిమ్నాస్టిక్స్ లో ఆయన అథ్లెట్‌గా రాణించారు. బాక్సింగ్‌, జంపింగ్‌ ఆయన ఈజీగా చేసేస్తారు.ఆయన హీరోగా నటించిన చిత్రాల్లో చాలా వరకు తన రియల్‌ స్టంట్స్ ఉపయోగించేవారు. రియల్‌గానూ చేసేవారు. అలా సినిమాల్లోనూ పాపులర్‌ అయ్యారు శ్రీహరి. 
 

38

హైదరాబాద్‌ కి చెందిన శ్రీహరికి చిన్నప్పుడు చాలా జాబ్‌లు వచ్చాయి. స్పోర్ట్స్ కోటాలో ఆయనకు ఎస్‌ఐగా ఆఫర్‌ వచ్చింది. కానీ వదులుకున్నారు. దీంతోపాటు రైల్వే ఆఫీసర్‌గానూ జాబ్‌ ఆఫర్‌ చేసిందిప్రభుత్వం. కానీ రిజెక్ట్ చేశారు. సినిమాపై ఇష్టంతో ఆయన స్టంట్స్ నేర్చుకున్నాడు. డిగ్రీ చదువుకునే సమయంలోనే `బ్రహ్మనాయుడు` చిత్రంతో నటుడిగా పరిచయం చేశారు దాసరి నారాయణరావు. ఆ తర్వాత విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా అనేక సినిమాలు చేశాడు శ్రీహరి. 
 

48

ఇదిలా ఉంటే శ్రీహరి.. `మగధీర` ముఖ్య పాత్రలో నటించారు. ఇందులో షేర్‌ ఖాన్‌గా, సోలోమన్‌గా ద్విపాత్రాభినయం చేశారు. ఈ మూవీ ఫ్లాష్‌ బ్యాక్ లో రామ్‌ చరణ్‌కి విలన్ గా నటించాడు శ్రీహరి, కానీ ప్రస్తుతంలో మాత్రం స్నేహితుడిగా కనిపించారు. చివరికి రామ్‌ చరణ్‌ కోసం పోరాడుతాడు. 
 

58

అయితే ఈ సందర్భంగా సినిమా షూటింగ్‌ టైమ్‌లో అనుభవాన్ని పంచుకున్నారు శ్రీహరి. రామ్‌చరణ్‌ అంటే తనకు ఎంత ప్రేమనో వెల్లడించారు. అంతేకాదు చిరంజీవి విషయంలో ఎంతటి రెస్పెక్ట్ తో, ఫ్యామిలీ మెంబర్‌గా భావిస్తాడో తెలియజేశాడు. దీనికి సంబంధించిన ఓ రేర్‌ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
 

68

ఇందులో శ్రీహరి చెబుతూ, `మగధీర`లో రామ్‌ చరణ్‌ ఫైట్‌ సీన్లు చేస్తుంటే తనకు భయమేసేదట. ఆఆయన ఉన్న షాట్‌లు అన్నీ తానే దగ్గరుండి చూసుకునేవాడట. తానే స్వయంగా వెళ్లి రోప్‌లు అన్ని చెక్‌ చేసుకునేవాడట. దీంతో రామ్‌చరణ్‌ ఇదంతా గమనించి..మీరెందుకు అవన్నీ చూసుకుంటున్నారు అంకుల్‌.. అసిస్టెంట్లు ఉన్నారు కదా అని అడిగితే, ఎందుకంటే సెట్‌ నేను ఉన్నాను కాబట్టి అని చెప్పాడు శ్రీహరి.
 

78

అంటే ఆయన ఉద్దేశ్యం ప్రకారం.. సెట్‌లో తాను రామ్‌ చరణ్‌కి ఏం కాకూడదు, శ్రీహరి ఉన్నా సెట్‌లో ఇలాంటి ఘటన జరిగిందా అనే పేరు రాకూడదు, అదే సమయంలో శ్రీహరి ఉన్నాడంటే అందులో ఏం కాదు, ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ధైర్యంగా ఉండొచ్చు అనే నమ్మకాన్ని కలిగించాలన్నదే శ్రీహరి ఉద్దేశ్యం. చిరంజీవితో ఉన్న అనుబంధానికి అది నిదర్శనంగా చెప్పొచ్చు. శ్రీహరి చెప్పిన ఈ రేర్ క్లిప్‌ యూట్యూబ్‌ లో ట్రెండ్‌ అవుతుంది. 

88

1987లో `బ్రహ్మనాయుడు` చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఆయన `పోలీస్‌`, `బలరాం`, `అయోధ్య రామయ్య`, `శివాజీ`, `ఒరేయ్‌ తమ్ముడు`, `సాంబయ్య`, `భద్రాచలం`, `సింహాచలం`, `కుబుసం`, `పృథ్వీ నారాయణ`, `పరశురామ్`, `శేషాద్రి నాయుడు`, `కూలీ`వంటి చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించారు. చివరగా ఆయన తెలుగులో `రఫ్‌` చిత్రంలో మెరిశారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీలోనూ నటించారు శ్రీహరి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories