Rohit Shetty Birthday
Rohit Shetty 10 Best Movies With 100 Crores : బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఒకరు. 51 ఏళ్ల రోహిత్ శెట్టి యాక్షన్ సీనిమాలకు పెట్టింది పేరు. 1974లో ముంబైలో పుట్టి పెరిగిన రోహిత్ తండ్రి ఎం.పి.శెట్టి. ఈయన 60-70 కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలు వేయడంతో పాటు స్టంట్ మేన్ గా కూడా పనిచేశాడు. రోహిత్ కూడా బాలీవుడ్‌లో చాలా హిట్ సినిమాలు ఇచ్చాడు. బాలీవుడ్ లో ఆయన చేసిన 10 సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు రోహిత్ మాత్రమే. ఇక 100 కోట్ల క్లబ్ లో చేరిన రోహిత్ సినిమాలేవంటే.
Also Read: పుష్ప2 మూవీ అంతా అల్లు అర్జున్ గుట్కా తినడం వెనుక కారణం ఏంటో తెలుసా? సుకుమార్ మాస్టర్ ప్లాన్ సక్సెస్
1. గోల్‌మాల్ 3
రోహిత్ శెట్టి మొదటి 100 కోట్ల సినిమా 2010లో వచ్చిన గోల్‌మాల్ 3. ఈ సినిమా రూ.167 కోట్లు వసూలు చేసింది. ఇందులో అజయ్ దేవగన్, కరీనా కపూర్, అర్షద్ వార్సి, తుషార్ కపూర్ ఇలా చాలా మంది బాలీవుడ్ స్టార్స్ నటించారు.
2. సింగం
2011లో తెరపైకి వచ్చిన సూపర్ హిట్ సినిమా సింగం. బాక్స్ ఆఫీస్‌లో 157.89 కోట్లు వసూలు చేసింది. ఇందులో అజయ్ దేవగన్, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్ లాంటి ఎంతో మంది స్టార్స్ నటించారు.
Also Read:రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ ? ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్ డేట్, ఏ పాత్రలో కనిపించబోతున్నాడు?
3. బోల్ బచ్చన్
2012లో వచ్చిన రోహిత్ శెట్టి బోల్ బచ్చన్ సినిమా కూడా బాగా ఆడింది. ఈ సినిమా 165 కోట్లు వసూలు చేసింది. ఇందులో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రాచి దేశాయ్ నటించారు.
4. చెన్నై ఎక్స్‌ప్రెస్
2013లో షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, సత్యరాజ్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాస్ట్ అయ్యింది. వేరే లెవెల్‌లో హిట్ అందుకుంది. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా 424 కోట్లు వసూలు చేసింది.
Also Read:పవన్ కళ్యాణ్, అనుష్క కాంబినేషన్ లో మిస్ అయిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు, లిస్ట్ లో రాజమౌళి సినిమా కూడా ?
5. సింగం రిటర్న్స్
సింగం సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సింగం రిటర్న్స్ కూడా అద్భుతం చేసింది. రోహిత్ శెట్టి రూపొందించి, 2014లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌లో బాగా ఆడింది. అజయ్ దేవగన్, కరీనా కపూర్ నటించిన సింగం రిటర్న్స్ 220.5 కోట్లు వసూలు చేసింది.
6. దిల్వాలే
షారుక్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కీర్తి సనోన్ నటించిన సినిమా దిల్వాలే. 2015లో వచ్చిన దిల్వాలే సినిమా 376.85 కోట్లు వసూలు చేసింది. రోహిత్ శెట్టి హిట్ సినిమాల్లో ఒకటిగా చేరింది.
Also Read:ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?
simmba
7. గోల్‌మాల్ అగైన్
గోల్ మాల్ సినిమాకు రీమేక్ గా గోల్‌మాల్ అగైన్ సినిమాను తెరకెక్కించారు రోహిత్ శెట్టి. 2017లో వచ్చిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, టబు, పరిణీతి చోప్రా, అర్షద్ వార్సి, తుషార్ కపూర్, కునాల్ కెము నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 310.9 కోట్లు వసూలు చేసింది.
8. సింబా
రణ్‌వీర్ సింగ్, సారా అలీఖాన్, సోను సూద్ నటించిన సింబా సినిమా 2018లో వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌లో 400.19 కోట్లు బిజినెస్ చేసింది.
Also Read: హనీమూన్ ట్రిప్ లో శోభిత, నాగచైతన్య, రొమాంటిక్ టూర్ లో సాహసాలు చేస్తున్న స్టార్ కపుల్