100 కోట్ల విలువైన తమ ఇంటిలో అద్భుతమైన స్టూడియోను కట్టించారు నయనతార, విఘ్నేష్ శివన్. 7000 అడుగుల ప్లేస్ లో లేడీ సూపర్ స్టార్ స్టూడియో కు సబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఇల్లు కొనాలనేది చాలా మంది ప్రముఖుల కల. ఇక్కడే జయలలిత, రజినీకాంత్, ధనుష్ లాంటి స్టార్స్ ఇళ్లు ఇక్కడే ఉన్నాయి. కాగా నయనతార కూడా గత 10 ఏళ్లుగా ఇక్కడ ఇల్లు తీసుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నించారు.
ఎట్టకేలకు పోయేస్ గార్డెన్ లో తమ కలల ఇంటిని నిర్మించుకుంది నయనతార. దాదాపు 7000 చదరపు అడుగుల్లో, 100 కోట్ల ఖర్చుతో 3 అంతస్తుల్లో ఈ ఇల్లు కట్టారు. కింద అంతస్తు మొత్తం స్టూడియోలా డిజైన్ చేయించారు నయనతార దంపతులు.
ఆ ఇంటి ఇంటీరియర్ అద్భుతానికి ప్రతీ ఒక్కరు మత్రముగ్ధులు అవ్వాల్సిందే. నయనతార, విక్కీ ఇద్దరికీ పాతకాలపు వస్తువులు, కళాత్మకమైన వస్తువులంటే ఇష్టం. అందుకే ఈ స్టూడియోని అలా డిజైన్ చేశారు.
ఇంటి నేల, మెట్లు, తోట, టెర్రస్‌పై గది, బొమ్మలు చూస్తే మ్యూజియం చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో ఎక్కువగా చెక్క వస్తువులే ఉన్నాయి. గాలి, వెలుతురు బాగా వచ్చేలా ఇల్లు కట్టారు.
రెండో అంతస్తులో పిల్లల కోసం ప్లే స్టేషన్, నయన్-విక్కీ సినిమా పనుల గురించి మాట్లాడుకునేందుకు వీలుగా డిస్కర్షన్ ఏరియా ను డిజైన్ చేశారు.
77
పోయెస్ తోటలో ముఖ్యమైన వాళ్ల ఇల్లు
కింద అంతస్తు ఇలా ఉన్నా, నయనతార తన భర్త, పిల్లలతో మొదటి అంతస్తులో ఉంటోంది. అక్కడ కిచెన్, బెడ్‌రూమ్ ఉన్నాయి. మిగతా ఇళ్ల కంటే పోయేస్ గార్డెన్ లో ధనుష్, నయనతార ఇళ్లు పెద్దగా కనిపిస్తున్నాయి.