Allu Arjun, Pushpa 2: The Rule, 3D
Why Allu Arjun Chews Gutka in Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ లో భారీ వివాదానికి దారి తీసిన ఈమూవీ.. దేశ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ముఖ్యంగా నార్త్ లో ఎక్కువ కలెక్షన్స్ ను సాధించింది సినిమా. సౌత్ కంటే కూడా అక్కడే ఎక్కువగా వసూళ్ళు సాధించింది. హిందీ ప్రేక్షకులు ఈసినిమాకు బ్రహ్మరథం పట్టారు. పుష్ప2 సినిమా ఓవర్ ఆల్ గా 1800 కోట్లకు పైగా సాధించింది. ఇక నార్త్ నుంచి 800 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.
Also Read: హనీమూన్ ట్రిప్ లో శోభిత, నాగచైతన్య, రొమాంటిక్ టూర్ లో సాహసాలు చేస్తున్న స్టార్ కపుల్
Allu Arjun, Pushpa 2,
ఇక పుష్ప, శ్రీవల్లి క్యారెక్టర్స్ తో పాటు పాటలు, ఫైట్లు... ఒక్కటేమిటి.. సినిమా అంతా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఈసినిమాలో జాతర ఎపిసోడ్ తో పాటు ఫైనల్ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. అల్లు అర్జున్ పాత్ర అద్భుతంగా డిజైన్ చేశాడు సుకుమార్. అయితే అల్లు అర్జున్ కు ఈసినిమాలో భుజం ఒక వైపు పైకి లేచి ఉంటుంది కదా. అది అందరికి తెలుసు. పుష్పరాజ్ కు సబంధించిన మరో విషయం ఇక్కడ హైలెట్ అయ్యింది. అదేంటంటే?
Also Read: ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?
సినిమా అంతా ఐకాన్ స్టార్ గుట్కా నములుతూ ఉంటాడు. అది నోట్లో ఉండటంతో మాట్లాడటం కూడా కాస్త డిఫరెంట్ గా మాట్లాడుతుంటాడు. సినిమా అంతా ఇలాగే నడుస్తుంది. ఆకరికి దమ్ముంటే పట్టుకోర షెకావత్ పాట కూడా అల్లు అర్జున్ ఇలాగే పాడాడు.
అయితే ఎందుకు ఇలా గుట్కా నమలడం, పాట కూడా అలానే పాడించడం, సినిమాలో ఎక్కడా అల్లు అర్జున్ క్లీన్ వాయిస్ లేకుండా చేయడంలో సుకుమార్ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా? మనం ముందే చెప్పుకున్నాం కదా.. నార్త్ లో పుష్ప2కు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అని.. ఈరెండింటికి ఓ సంబంధం ఉంది.
Also Read: రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ ? ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్ డేట్, ఏ పాత్రలో కనిపించబోతున్నాడు?