మంచి మనసు చాటుకున్న మాస్ మహారాజ్, రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన రవితేజ,

First Published Aug 7, 2022, 1:22 PM IST

రవితేజ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. మాస్ మహారాజ్ తన రెమ్యూనరేషన్ ను త్యాగం చేశాడు. ఇంతకీ రవితేజ ఎందుకలా చేశాడు..? ఏ సినిమా విషయంలో ఉదారత చూపాడు చూద్దాం..

Ravi Teja

రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ య్యింది రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా.  జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా విషయంలో మేకర్స్ ను ఆదుకున్నాడట రవితేజ. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించిన ఈ సినిమా కోసం మాస్ మహారాజ్ 15 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడట. 

 సినిమా ప్లాప్ అవ్వడంతో .. మేకర్స్ ను ఆదుకోవాలని రవితేజ్ భావించారట. అందుకే ఈ విషయంలో రవితేజ  ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు రవితేజ్ తీసుకున్న మొత్తం రెమ్యూనరేషన్  15 కోట్లను వెనక్కి ఇచ్చేసినట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్టార్ హీరోలు తమ రెమ్యూనరేషన్లు తగ్గించుకోవాలి అని డిమాండ్లు వినిపిస్తున్న టైమ్ లో.. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఫిలిం ఛాంబర్ చర్చలు జరుపుతున్నాయి.  ఈ విషయంలో నిర్మాతలు కూడా దిల్ ఖుష్ అయ్యారని సమాచారం.  

ఇక బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ మాస్ మహారాజ్ రవితేజ ఫుల్ బిజీగా ఉన్నారు.  టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, ధమాకా లాంటి పవర్ ఫుల్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇవి కాకుండా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో కీలకపాత్రలో కనిపించంబోతున్నారు. 

సరిగ్గా ఇదే టైమ్ లో  రవితేజ తీసుకున్న నిర్ణయం తో స్టార్ హీరోలను ఇరకాటంలోకి నెట్టింది. రవితేజ రెమ్యూనరేషన్ మొత్తాన్ని వదులుకుంటే..స్టార్ హీరోలు కనీసం తగ్గించుకోలేరా అంటూ...రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయంతో రవితేజ అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పుకుంటున్నారు.

రవితేజ హీరోగా నటిస్తూనే తన సినిమాకు నిర్మాతగా కూడా ఉన్నాు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్ బ్యానర్ లపై రామారావు ఆన్ డ్యూటీ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా  18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా అందులో ఫస్ట్ వీక్ కేవలం  5 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చినట్టు సమాచారం. 
 

రామారావు ఆన్ డ్యూటీ సినిమా  ఫుల్ రన్ ముగిసే సరికి దాదాపు 13 కోట్ల నష్టం వస్తుందన్న అంచానాలతో రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నారట.  ఇర ఈ విషయంలో నిర్మాతలు అలనాటిస్టార్ హీరో కృష్ణను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కూడా నిర్మాత నష్టపోతే తన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేవారట. లేదంటో ఇంకో సినిమాచేయడానికి డేట్స్ ఇచ్చేవారట. 
 

click me!