టాలీవుడ్ రేంజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడు రాజమౌళి. బాహుబలలితో మన సత్తా చాటిన ఆయన.. 'ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ కదిలి వచ్చేలా చేశారు. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ యన్‌టీఆర్ హీరోలుగా పాన్ వరల్డ్ మూవీగా 2022 మార్చి 24న రిలీజ్ అయ్యింది సినిమా. రిలీజ్ అయ్యి అవ్వడంతోనే.. రికార్డ్ లు బ్రేక్ చేస్తూ వచ్చిన ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించింది. ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లింది.