రిలీజ్ కు ముందే రికార్డ్స్ బ్లాస్ట్ చేస్తున్న రజినీకాంత్ సినిమా, కూలీ సినిమా డిజిటల్ రైట్స్ ఎన్నికోట్లు?

Published : Mar 16, 2025, 08:43 AM IST

రిలీజ్ కు ముందే రికార్డ్స్ బ్రేక్  చేయడానికి రెడీ అవుతోంది, రజినీకాంత్ కూలి సినిమా. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రిరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్టు సమాచారం.   

PREV
15
రిలీజ్ కు ముందే రికార్డ్స్ బ్లాస్ట్ చేస్తున్న రజినీకాంత్ సినిమా,  కూలీ సినిమా డిజిటల్ రైట్స్ ఎన్నికోట్లు?
కూలీ మూవీ

Rajinikanth Coolie Movie Digital Rights:  సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే, ఆ సినిమా ఓపెనింగ్ నుంచి ఫ్యాన్స్ లో అంచనాలు పెరుగుతుంటాయి. అంతే కాదు ఆడియన్స్ లో ఆసక్తి కూడా ఎక్కువైపోతుంది. సినిమా గురించి ఎప్పుడు అప్డేట్ వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజినీ అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు.

Also Read: పుష్ప2 మూవీ అంతా అల్లు అర్జున్ గుట్కా తినడం వెనుక కారణం ఏంటో తెలుసా? సుకుమార్ మాస్టర్ ప్లాన్ సక్సెస్

25
లోకేష్ కనగరాజ్:

వేటయాన్ సినిమా తర్వాత, రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో 'కూలీ' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రజినీకాంత్‌కు మంచి హిట్ ఇస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఇక  ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు శృతి హాసన్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి పెద్ద పెద్ద  స్టార్స్ కూడా కనిపించబోతున్నారు. 

Also Read:100 కోట్ల ఇంటిని స్టూడియోగా మార్చిన నయనతార ‌- విఘ్నేష్ శివన్, ఇంటీరియర్ అద్భుతం చూశారా?

 

35
చివరి దశలో కూలీ:

'కూలీ' సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. లోకేష్ కనగరాజ్ పుట్టినరోజుకు విషెస్ చెబుతూ సన్ పిక్చర్స్ కొన్ని ఫోటోలు రిలీజ్ చేసింది. ఈ ఫోటోల్లో లోకేష్ కనగరాజ్, రజినీకాంత్, ఉపేంద్ర, సత్యరాజ్, నాగార్జున ఉన్నారు. లోకేష్ అమీర్ ఖాన్ ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు.

Also Read:హనీమూన్ ట్రిప్ లో శోభిత, నాగచైతన్య, రొమాంటిక్ టూర్ లో సాహసాలు చేస్తున్న స్టార్ కపుల్

45
అమెజాన్ ఓటీటీ:

ఈ నెలతో 'కూలీ' సినిమా షూటింగ్ అయిపోతుంది. ఆ తర్వాత కూలీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. సినిమా షూటింగ్ కాకముందే, ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ఓటీటీ కొనేసింది. భారీ రేటుకు ఈసినిమా హక్కులు అమ్మకం జరిగిందని తెలుస్తోంది. 

Also Read:రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ ? ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్ డేట్, ఏ పాత్రలో కనిపించబోతున్నాడు?

 

55
కూలీ సినిమా డిజిటల్ అమ్మకం:

సూపర్ స్టార్ కూలీ సినిమా డిజిటల్ హక్కులను రూ.120 కోట్లకు అమెజాన్ కొనుక్కుందని సమాచారం. రజినీకాంత్ 650 కోట్లు వసూలు చేసిన జైలర్ సినిమా రూ.100 కోట్లకు డిజిటల్ రైట్స్ అమ్మారు. దానికంటే ఇది 20 కోట్లు ఎక్కువ. ఎక్కువ ధరకు డిజిటల్‌లో అమ్ముడుపోయిన రజినీ సినిమా ఇదేనని అంటున్నారు. దీని గురించి ఇంకా అధికారిక సమాచారం మాత్రం  రాలేదు.

Also Read:పవన్ కళ్యాణ్, అనుష్క కాంబినేషన్ లో మిస్ అయిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు, లిస్ట్ లో రాజమౌళి సినిమా కూడా ?

Also Read:100 కోట్ల క్లబ్‌లో 10 సినిమాలు చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Read more Photos on
click me!

Recommended Stories