పిలవకపోవడానికి అసలు కారణం
అమితాబచ్చన్ తల్లి తేజీ బచ్చన్ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల పెళ్లిని చాలా సింపుల్‌గా చేశామని అభిషేక్ బచ్చన్ వివరణ ఇచ్చారు. అందుకే బాలీవుడ్ స్టార్స్‌ను పిలవలేదని, ఎక్కువ హడావుడి వద్దనుకున్నామని ఆయన అప్పుడు అన్నారు.
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ పెళ్లి 2007 ఏప్రిల్ 20న జరిగింది. వీరికి 2012 లో ఆధ్య అనే కూతురు కూడా పుట్టింది. ఇక ఈమధ్య వరకూ వీరు విడాకులు తీసుకోబోతున్నారంటు పుకార్లు బాలీవుడ్ అంతటా వ్యాప్తించాయి. అయితే ఈ విషయంలో ఇద్దరు స్టార్లు ఇంత వరకూ స్పందించలేదు.