ఈ ఒక్క రోజు కోసం 25ఏళ్లు నరకం చూశా, శివాజీ ఎమోషనల్‌.. ఇక నా టైమ్‌ మొదలైంది

Published : Mar 16, 2025, 07:09 AM ISTUpdated : Mar 16, 2025, 09:25 AM IST

Sivaji: నటుడు శివాజీ `కోర్ట్` సినిమాలో నటించిన మంగపతి పాత్రకి విశేష ప్రశంసలు దక్కుతున్న నేపథ్యంలో సక్సెస్‌ మీట్‌లో ఆయన ఎమోషనల్‌ అయ్యారు. ఈ శుక్రవారం కోసమే 25ఏళ్లు వెయిట్‌ చేశానంటూ భావోద్వేగానికి గురయ్యారు.   

PREV
15
ఈ ఒక్క రోజు కోసం 25ఏళ్లు నరకం చూశా,  శివాజీ ఎమోషనల్‌.. ఇక నా టైమ్‌ మొదలైంది
sivaji

Sivaji: నటుడు శివాజీ ఒకప్పుడు కామెడీ హీరోగా రాణించారు. అనేక విజయాలు అందుకున్నారు. హీరోగానే కాదు ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. విలక్షణ నటుడిగా రాణించారు. కానీ కొంత కాలం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలను పక్కన పెట్టారు. అక్కడ సక్సెస్‌ కాకపోవడంతో మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చారు. ఆ మధ్య `90 మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌` అనే వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకున్నారు. 

25
court movie review

కానీ ఆయనకు సరైన కమ్‌ బ్యాక్‌ అనిపించలేదు. ఈ క్రమంలో రీఎంట్రీ ఇస్తూ `కోర్ట్` అనే చిత్రంలో నటించారు. ఇందులో ఆయనది నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర. హీరో నాని నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్‌కి మామ పాత్రలో నటించారు శివాజీ. హీరో ప్రియదర్శి, కుర్రాడు రోషన్‌లను కాకుండా అందరి చూపు తనవైపు తిప్పుకున్నారు. నెగటివ్‌ పాత్రలో రెచ్చిపోయాడు. సినిమాలో ఆయన పాత్రనే హైలైట్‌గా నిలిచింది. ప్రియదర్శి, రోషన్‌లను డామినేట్‌ చేసింది. పరువు కోసం ఎంత దూరమైన వెళ్లే పాత్రలో శివాజీ రెచ్చిపోయాడు. ఆయన పాత్రకి విశేష స్పందన లభిస్తుంది. 
 

35
sivaji

`కోర్ట్` సినిమాకి కూడా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. డీసెంట్‌గా ఆడుతుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఇందులో శివాజీ మాట్లాడుతూ ఎమోషన్‌ అయ్యారు. ఇలాంటి రోజు కోసం, ఇలాంటి ఒక్క శుక్రవారం కోసం 25ఏళ్లు ఎదురుచూశానని తెలిపారు. ఈ శుక్రవారం కొడతాం, ఈ శుక్రవారం కొడతామని అనుకుంటూనే ఉన్నాను, కానీ ఎప్పుడూ ఆ కసి తీరలేదని, సరైన బ్రేక్‌ వచ్చే శుక్రవారం ఎప్పుడూ రాలేదని, వెయిట్‌ చేసి వెయిట్‌ చేసి ఈ 25ఏళ్లు నరకం చూశానని చెబుతూ స్టేజ్‌పైనే ఎమోషనల్‌ అయ్యారు శివాజీ. 

45
sivaji

అంతేకాదు స్టేజ్‌పై ఆయన కాసేపు కూర్చున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో తిష్టవేశాను, ఈ రోజుకోసమే ఇన్నాళ్లు వెయిట్‌ చేశాను అంటూ శివాజీ ఎప్పుడూ లేని విధంగా ఈసారి భావోద్వేగంతో మాట్లాడారు. అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పారు. అలాగే ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాని నమ్మడం గొప్ప విజయంగా భావిస్తున్నట్టు తెలిపారు. కొత్త కుర్రాళ్లని, మంచి కంటెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తున్న నానికి అభినందనలు తెలిపారు. తనకు ఇంతటి సంతృప్తికి కారణం నాని, దర్శకుడు జగదీష్‌ అని తెలిపారు. 

55
sivaji

ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బిగ్‌ బాస్‌కి రావడానికి ముందు తనకు ఓ భారీ పాన్‌ ఇండియా సినిమాలో ఆఫర్‌ వచ్చిందని, అంతా ఓకే అనుకున్నాక మిస్‌ అయ్యిందని, పల్లెందాక వచ్చింది, కానీ నోట్లోకి వెళ్లలేదని, ఆ సమయంలో చాలా బాధపడినట్టు తెలిపారు శివాజీ. ఇంకా ఎప్పుడు మన రోజు అంటూ బాధపడినట్టు తెలిపారు.

అయితే బిగ్‌ బాస్‌ షో తన జీవితాన్ని మార్చేసిందని, ఓపికని, సహనాన్ని పెంచిందన్నారు. మన రోజుకోసం వెయిట్‌ చేయాలని నేర్పించిందన్నారు. ఆ ఫలితమే ఈ రోజు అని అన్నారు. బిగ్‌ బాస్‌ తర్వాత కూడా చాలా ఆఫర్లు వచ్చాయని, కానీ ఇలాంటి పాత్ర కోసమే వెయిట్‌ చేశానని, ఈ మూవీ వచ్చినప్పుడు కూడా ఇది పేలిపోయే పాత్ర అవుతుందని తెలుసు,

కానీ ఎక్కడ మిస్‌ అవుతుందో అని టెన్షన్‌ పడ్డానని, చేసినప్పుడు మాత్రం ఇక విశ్వరూపం చూపించాల్సిందే అని అనుకున్నానని, అదే జరిగిందన్నారు. ఇప్పుడు వస్తున్న ప్రశంసలు, ఫోన్‌ కాల్స్, మెసేజ్‌లు చూస్తుంటే సంతృప్తిగా  ఉందన్నారు శివాజీ. ఈ సందర్భంగా తన మనసులోని బాధనంతా వెల్లడించారు. అందరిని ఆకట్టుకున్నారు. 

read  more: థియేటర్లో పునీత్‌ రాజ్‌కుమార్‌ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న `ఇడియట్‌` హీరోయిన్‌.. ఎమోషనల్‌ కామెంట్‌

also read: ఎన్టీఆర్‌, నెల్సన్‌ మూవీకి మతిపోయే టైటిల్‌

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories