ఒత్తిడిలో టాబ్లెట్స్ మింగేశా..పునర్నవిని మర్చిపోయాను అందుకే...!

First Published Jan 28, 2021, 2:25 PM IST

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కొత్తగా గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆయన ఊకో కాకా పేరుతో గార్మెంట్స్ స్టోర్స్ చైన్ నడుపుతున్నారు. కొత్తగా హైదరాబాద్ లో ఆయన ఓ స్టోర్ ఓపెన్ చేయగా... ప్రారంభ కార్యక్రమంలో బుల్లితెర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. 
 

ఊకో కాకా స్టోర్ ప్రారంభోత్సవంలో రాహుల్ సింప్లిగంజ్ ఫ్రెండ్ ఆషు రెడ్డి ప్రత్యేకంగా నిలిచారు. ఆషు రెడ్డికి రాహుల్ కి మధ్య సంథింగ్ సంథింగ్ అని పుకార్ల నేపథ్యంలో ఆమె రాక అనేక అనుమానాలకు కారణం అయ్యింది.
undefined
స్టోర్ ప్రారంభానికి ముందు ఆషు రెడ్డితో రాహుల్ ఓ ఆసక్తికర ఫోటో పంచుకున్నారు. ఆషురెడ్డి ని రాహుల్ పైకి ఎక్కించుకొని రొమాంటిక్ పోజిచ్చారు. ప్రస్తుతం రాహుల్, ఆషురెడ్డి రిలేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది.
undefined
అయితే బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ తోటి కంటెస్టెంట్ పునర్నవితో జరిపిన ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సీజన్లో వీరిద్దరి రొమాన్స్ చూసిన ప్రేక్షకులు వీరు పెళ్లి చేసుకోవడం కూడా ఖాయం అన్నారు.  టైటిల్ విన్నర్ గా హౌస్ నుండి బయటికి వచ్చిన రాహుల్, పునర్నవితో మంచి బాండింగ్ మైంటైన్ చేశారు. కాలం గడిచే కొద్దీ వీరి బంధం మెల్లగా పలుచబడింది.
undefined
ఐతే రాహుల్-పునర్నవి ఇప్పటికీ ప్రేక్షకుల క్రేజీ లవ్ పెయిర్ గా ఉన్నారు. అయితే రాహుల్ తన కొత్త స్టోర్ ప్రారంభానికి బుల్లితెరకు సంబంధించిన అనేక మందిని పిలిచి పునర్నవిని పిలవలేదు. ఊకో కాకా స్టోర్ ఇనాగరేషన్ సెరిమొనిలో పునర్నవి కనిపించలేదు.
undefined
ఆషురెడ్డి కనిపించిన ఈ ఈవెంట్ కి పునర్నవి హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ పునర్నవి మధ్య విభేదాల కారణంగానే ఆమెను రాహుల్ పిలవలేదని అందరూ అనుకుంటున్నారు.  కాగా ఈ విషయంపై రాహుల్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
undefined
పునర్నవి రాకపోవడం వెనుక కారణం ఆయన తెలియజేశారు. స్టోర్ ప్రారంభించే క్రమంలో పనుల వలన రాహుల్ ఒత్తిడికి గురయ్యాడట.
undefined
టెన్షన్ తగ్గడానికి టాబ్లెట్స్ కూడా వేసుకున్నాడట. పని ఒత్తిడి వలన పునర్నవిని ఆహ్వానించడం మర్చిపోయానని, అంతకు మించి మా మధ్య విభేదాలు ఏమి లేవని క్లారిటీ ఇచ్చారు.
undefined
click me!