టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా కొన్నేళ్లు పాటు తెలుగు ప్రేక్షకులను అలరించింది. భారీస్థాయిలో హిట్లను అందుకోకపోయినా.. తన నటన, గ్లామర్ తో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
‘ఊహాలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. చక్కటి నటనతో అలరించింది. ఆ తర్వాత నుంచి తెలుగులోనే వరుస సినిమాలు చేసింది. హిట్లను కూడా అందుకుంది.
ప్రస్తుతం తమిళం, హిందీలో వరుసగా సినిమాలు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. వరుస పోస్టులతో ఫిదా చేస్తోంది. అలాగే గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో మెరిసి అందాల విందు చేసింది. స్లీవ్ లెస్ ఫ్రాక్ లో దర్శనిచ్చి గ్లామర్ షోతో మతులు పోగొట్టింది. క్లీవేజ్ షోతో ఉక్కిరిబిక్కిరి చేసింది. నిషా కళ్లతో కసి చూపులతో కవ్వించింది. అందమైన ఫోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది.
తెలుగులో వరుసగా ఆఫర్లు అందుకుంటున్నప్పటికీ పెద్దగా ఆశించిన స్థాయిలో ఈ ముద్దుగుమ్మకు సక్సెస్ అందడం లేదు. దీంతో రాశీ ఖన్న బాలీవుడ్, తమిళంపై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది ‘ఫర్జీ’ అనే సిరీస్ మంచి సక్సెస్ అందుకుంది. ఆమె నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
కేరీర్ విషయానికొస్తే.. తమిళంలో రాశీఖన్నా వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం హిందీలో ‘యోదా’ అనే చిత్రంతో పాటు తమిళంలో ‘అరన్మణై4’, ‘మేతావి’ చిత్రాల్లో నటిస్తోంది. ఇవన్నీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక తెలుగులో చివరిగా ‘థ్యాంక్యూ’’తో అలరించింది. మళ్లీ ఎప్పుడు టాలీవుడ్ లో మెరుస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.