కృతి సనన్ కు ప్రపోజ్ చేయబోతున్న ప్రభాస్..? రొమాంటిక్ ప్లేస్ లో ప్లాన్ చేసుకున్న స్టార్ కపుల్..?

First Published Dec 28, 2022, 10:11 PM IST

మరోసారి ప్రభాస్ ‌- కృతిసనన్ ప్రేమ పుకార్లు బయటకు వచ్చాయి. కృతి సనన్ కు ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతున్నాడట యంగ్ రెబల్ స్టార్.  దానికోసం రొమాంటిక్ ప్లేస్ కూడా సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 

ప్రభాస్-కృతి సనన్ ప్రేమలో ఉన్నారని గత కొద్దికాలంగా వరుసగా వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఆదిపురుష్ లో కలిసి నటిస్తున్న ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారని అటు బాలీవుడ్ మీడియా.. ఇటు సౌత్ సోషల్ మీడియా కోడై కూసింది. అయితే అందులో నిజం లేదంటూ తాము మంచి ఫ్రెండ్స్ అని కృతి సనన్ క్లారిటీ ఇవ్వడంతో ఆగిపోయిన ఈ గాసిప్స్ మళ్ళీ ఇప్పుడు మొదలయ్యాయి. 

త్వరలో కృతి సనన్‌కు ప్రభాస్ ప్రపోజ్ చేయబోతున్నాడని నెట్టింట న్యూస్ తో  పెద్ద దుమారేమే రేపుతోంది. ప్రభాస్ కృతీ సనన్ కు తన ప్రేమను ప్రపోజ్ చేయడం కోసం రెడీ అవుతున్నాడని.. న్యూ ఇయర్ కు ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 31న ఆయన తన ప్రేమను తెలుప బోతున్నాడంటూ.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. 
 

అంతే కాదు తన ప్రేమను తెలపడం కోసం ప్రత్యేకంగా రొమాంటిక్ ప్లేస్ ను కూడా సెలక్ట్ చేసుకున్నారట ఈ జంట. కృతీ సనన్ కు తన ప్రేమను ముచ్చటగా మాల్దీవ్స్ లో తెలుపబోతున్నాడట యంగ్ రెబల్స్ స్టార్. ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ షికారు చేస్తోంది.  
 

Prabhas-Kriti Sanon

రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మధ్య ఏదో నడుస్తుందని గత కొద్ది కాలంగా విపరీతంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియా దద్దరిల్లేలా వార్తలు చక్కర్లు కొట్టాయి. 

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కరణ్ జోహార్ షోలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు కారణంగా ఈ రూమర్స్ ఇంకా ఎక్కువగా స్ప్రెడ్  అయ్యాయి.  వీరి సంబంధం గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా.. పరోక్షంగా హింట్ ఇచ్చాడు వరుణ్ ధావన్. ఈక్రమంలో కృతీ సనన్ తమ రిలేషన్ పై క్లారిటీ కూడా ఇవ్వాల్సి వచ్చింది.  తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని ఆమె ఓ సందర్భంలో అన్నారు.  
 

మరో వైపు వీరి బంధాన్ని  ఇద్దరూ అధికారికంగా ఒప్పుకోకపోయినా.. సందర్భాల్లో పరోక్షంగా తమ సంబంధాన్ని ఒప్పుకున్నట్లు ప్రవర్తించారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.  ప్రభాస్-కృతి సనన్ ఓ రౌత్ తెరకెక్కిస్తోన్న ఆదిపురుష్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరిద్దరూ క్లోజ్ అయ్యారని, ఎప్పుడూ షూటింగ్‌లో సైలెంట్‌గా ఉండే ప్రభాస్.. కృతితో మాత్రం తెగ కబుర్లు చెప్పేవాడని, ఇద్దరూ బాగా కలిసిపోయారంటూ.. బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. 

click me!