ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్.. ట్రెడిషనల్ లుక్ లోనూ అదిరిన కృతి సనన్ గ్లామర్ విందు!

First Published Oct 23, 2022, 6:54 PM IST

ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) ఫ్యాన్స్ కు ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చింది. పండగవేళ ట్రెడిషన్ వేర్ దర్శనమిచ్చి ఐఫీస్ట్ కలిగించింది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

తెలుగు ఆడియెన్స్ ను ఎప్పుడో పరిచయం చేసుకున్న కృతి సనన్.. తాజాగా మరోసారి అలరించబోతోంది. గతంలో సుకుమార్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘వన్ నేనొక్కడినే’లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ఆడిపాడింది.
 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ బ్యూటీ  కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. కృతి సనన్ సీతామహాలక్ష్మి పాత్రను పోషిస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

ప్రభాస్ సరసన నటించి మరోసారి దక్షిణాది ఆడియెన్స్ కు మరింత దగ్గర కానుంది కృతి సనన్.  ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను ఆకట్టుకుంటోంది. సినీ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ మరింత దగ్గరవుతోంది. 
 

తాజాగా దీపావళి సందర్భంగా కృతి సనన్ ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చింది. లేత గులాబీ లెహంగా, వోణీలో మరింతగా మెరిసిపోతోంది. సంప్రదాయ దుస్తుల్లో అదిరిపోయే పోజులిస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
 

పండగవేళ ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకోవడమే కాకుండా అందాల విందుకూడా చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ చూపిస్తూ మతి చెడగొట్టింది. చిరునవ్వులు చిందిస్తూ, కొంటే చూపులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంది. ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీ అందాన్ని పొగుడుతూ ఫొటోలకు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.
 

అయితే, ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంద్ పండిట్ దిపావళీ పార్టీలో కృతి సనన్ ఇలా మల్టీ కలర్డ్ లెహంగాలో హాలజరైంది. అందరీ చూపు తనపైనే పడేలా చేసింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ కృతి సనన్ ఫుల్ బీజీగా ఉంటోంది. త్వరలోనే ‘ఆదిపురుష్’తో ఆడియెన్స్ ను అలరించనుంది. 

click me!