విస్కీ కిక్ లో ఒళ్ళు మరచి చిందేసిన పూజా హెగ్డే... వీకెండ్ సెలెబ్రేషన్స్ వీడియో లీక్ చేసిన హాట్ బ్యూటీ

First Published Nov 28, 2021, 1:05 PM IST

వీకెండ్ సెలెబ్రేషన్స్ వీడియో లీకైంది. ఆమె విస్కీ మత్తులో కిరాక్ స్టెప్స్ వేస్తుండగా... వీడియో చూసిన ఫ్యాన్స్ కి పూనకాలు కలిగాయి. పూజా హెగ్డే (Pooja hegde)మంది పార్టీ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. 
 


అందరూ మద్యపాన ప్రియులే. మాటల్లో మాత్రం ఇది ఓ దురాచారం. అందుకే పబ్లిక్ లో మందుకొట్టడానికి, మాకు మందు అలవాటు ఉందని చెప్పుకోవడానికి జనాలు సిగ్గుపడతారు. ఈ విషయంలో సెలెబ్రిటీలు మరింత జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే పబ్లిక్ గా ఇలాంటి పనులు చేస్తే వాళ్ళను జనాలు ఏకిపారేస్తారు. 
 

అయితే డబ్బు మోజులో పడి ఇవ్వన్నీ పట్టించుకోవడం లేదు నేటితరం స్టార్స్. పరిమితులు లేని సోషల్ మీడియా ద్వారా ఆల్కహాల్ వంటి మత్తు పానీయాలను ప్రమోట్ చేస్తూ... బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా పూజా హెగ్డే రెడ్ లేబిల్ విస్కీకి తన ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రచారం కల్పించింది.

పెగ్గు కూడా ఎలా కలుపుకోవాలో చూపించడంతో పాటు.. చుక్క పడ్డాక చిందులే అంటూ కిరాక్ డాన్స్ స్టెప్స్ తో కాకరేపింది. సదరు మందు బ్రాండ్ గురించి తనదైన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మందేసి చిందేస్తునట్లున్న పూజా వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

కాగా ఇటీవలే మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్ళింది పూజా హెగ్డే. ఆ ట్రిప్ ముగించుకొని వచ్చిన పూజా మరలా షూటింగ్స్ లో బిజీ అయ్యారు. కాగా మాల్దీవ్స్ వెకేషన్ లో బికినీ ధరించి చెమటలు పట్టించింది పూజా. ఆమె వెకేషన్ మొత్తం బికినీలోనే  సాగింది. అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన బికినీ వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. రకరకాల బికినీలలో దర్శనం ఇస్తున్న పూజా కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. 


అసలు పూజ ఒకప్పటి ముకుంద లుక్ చూసినవారు,  నేటి బికినీ లుక్ చూస్తే ముక్కున వేలు వేసుకుంటారు. అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయిగా పట్టు పరికిణీలో మెస్మరైజ్ చేసిన పూజా, డీజే సినిమాలో బికినీ లుక్ ఇచ్చి షాక్ ఇచ్చింది. పూజా ఆ రేంజ్ గ్లామర్ షో చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. 
 

ఇక గ్లామర్ ప్రపంచంలో ఇవ్వన్నీ కామనే. మడికట్టుకు కూర్చుంటే అవకాశాలు దక్కవు. ఆఫర్స్ కోసం, స్టార్ డమ్ కోసం దర్శకుల కోరుకున్నట్లు పాత్రలలో ఒదిగిపోవాలి. అది బోల్డ్ రోలైనా... హోమ్లీ రోలైనా. ప్రస్తుతం పూజా అదే చేస్తుంది. 
 

ఇక పూజా స్టార్ దర్శకుల, నిర్మాతల ఫేవరేట్ హీరోయిన్ అయిపోయారు. ఒకసారి ఆమెతో పని చేసినవారు మళ్ళీ మళ్ళీ కావాలంటున్నారు. అరవింద సమేత చిత్రంతో పూజకు బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్ అయితే ఆమెను రిపీట్ చేస్తున్నారు. ఆయన గత చిత్రం అల వైకుంఠపురంలో పూజనే హీరోయిన్ గా నటించింది. నెక్స్ట్ మహేష్ తో చేస్తున్న చిత్రానికి కూడా... ఆమెనే ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అందం, అభినయం కలిసిన అరుదైన కాంబినేషన్ అమ్మడు సొంతం కాగా... అందరూ ఎగబడుతున్నారు. లక్కీ హీరోయిన్ అన్న ట్యాగ్ కూడా ఆమెకు ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో పూజ హెగ్డే నటించిన చిత్రాలు అన్నీ.. వరుస హిట్స్ కొట్టాయి. 

కాగా ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో బీస్ట్, రాధే శ్యామ్ (Radhe shyam), ఆచార్య (Acharya) వంటి భారీ చిత్రాలతో పాటు... హిందీతో సల్మాన్ ఖాన్ సరసన ఓ మూవీ చేస్తున్నారు. ఇక పారితోషికం కూడా కోట్లలో అందుకుంటున్న పూజా హెగ్డే, ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. దగ్గరుండి దానిని అభిరుచుకి తగ్గట్లు డిజైన్ చేయిస్తున్నారు.

Also read Malavika: కుర్రాళ్లపై మాళవిక అందాల దాడి.. ఇంతటి విస్పోటనం ఎప్పుడూ చూడలేదట.. యాక్షన్‌ చేస్తే గాయమైందంటూ ఆవేదన

Also read Deepthi Sunaina: పింక్ శారీలో చుట్టుకొలతలు చూపిస్తున్న దీప్తి, ఇమ్మెచ్యూర్ అంటూ నెట్టింట ట్రోల్స్

click me!