`భోళాశంకర్‌` ఆపేయండి బాస్‌`.. అన్న చిరుని గట్టిగా ఇరికించిన తమ్ముడు పవన్‌.. నెట్టింట రచ్చ రచ్చ..

First Published Dec 9, 2022, 3:20 PM IST

ఓటీటీలు వచ్చి రీమేక్‌ల కొంప ముంచుతున్నాయి. హీరోలకు పెద్ద సమస్యగా మారాయి. అయితే పవన్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చిరంజీవిని ఇబ్బంది పెడుతుంది. ఆయన సినిమాని ఆపేయాలంటూ అభిమానుల నుంచి నిరసన వ్యక్తమవుతుంది. 
 

రీమేక్‌ సినిమాల ట్రెండ్‌ కాలం చెల్లిందని చెప్పొచ్చు. ఓటీటీలు వచ్చి రీమేక్‌లకు బ్రేక్‌లు వేశాయి. ఏ భాషలో విడుదలైన సినిమా అయినా నెల రోజుల్లో ఓటీటీల్లో ఇంట్లోనే చూడొచ్చు. గత కొన్ని రోజులుగా ఏ రీమేక్‌ సినిమా ఆడటం లేదు. హిందీలో చేసిన రీమేక్‌లు అన్నీ పరాజయం చెందాయి. పవన్‌ చేసిన `భీమ్లా నాయక్‌` యావరేజ్‌గానే నిలిచింది. చిరంజీవి (Chiranjeevi) `గాడ్‌ ఫాదర్‌` పాజిటివ్‌ టాక్‌ వచ్చినా థియేటర్లో ఆడియెన్స్ సినిమాని చూడలేదు. ఈ నేపథ్యంలో దీని ప్రభావం ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌పై పడింది. 
 

పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) మరో రీమేక్‌(Pawan Remake) చేయబోతున్నారు. తమిళంలో హిట్‌ అయిన `థెరి` రీమేక్‌లో నటించబోతున్నారని తెలుస్తుంది. హరీష్‌ శంకర్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్‌ రానుంది. ప్రారంభోత్సవాలు చేయబోతున్నారట. హరీష్‌తో చేయాల్సిన `భవదీయుడు భగత్‌ సింగ్‌`ని పక్కన పెట్టి ఈ రీమేక్‌ చేయాలనే ఆలోచనలో ఉండటం ఇప్పుడు తీవ్ర స్థాయిలో పవన్‌ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏకంగా `వీయ్‌ డోంన్ట్ వాంట్‌ థెరి రీమేక్‌` అనే యాష్‌ ట్యాగ్ ని ట్రెండ్‌ చేస్తున్నారు. రెండు రోజులుగా అది ట్విట్టర్‌లో మోగిపోతుంది. 

ఈ నిరసన సెగ ఇప్పుడు చిరంజీవికి తగులుతుంది. తమ్ముడు పవన్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అన్న చిరంజీవికి దెబ్బ పడేలా ఉంది. పవన్‌పై ఉన్న నిరసన సెగ చిరు వైపు టర్న్ తిరుగుతుంది. చిరంజీవి కూడా రీమేక్‌లు చేయడం ఆపేయాలనే నినాదం ఊపందుకుంది. అంతేకాదు `భోళాశంకర్‌`ని ఆపేయాలని అభిమానులు డిమాండ్‌ చేస్తుండటం ఇప్పుడు ఆశ్చర్యానికి, షాక్కి గురి చేస్తుంది. 

చిరంజీవి నటిస్తున్న `భోళాశంకర్‌` రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఇది తమిళంలో రూపొందిన `వేదాళం`కి రీమేక్‌. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.మాస్‌ మసాలా యాక్షన్‌ కామెడీగా దీన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తమన్నా ఇందులో కథానాయికగా నటిస్తుండగా, కీర్తిసురేష్‌ చిరుకి చెల్లిగా చేస్తుంది. ప్రస్తుతం చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్‌ ఆపేశారు. జనవరి తర్వాత షూటింగ్‌ స్టార్ట్ చేసి పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే 70శాతం షూటింగ్‌ పూర్తయ్యిందట. మిగిలిన 30శాతం తీస్తే సినిమా కంప్లీట్‌ అవుతుంది. 

రీమేక్‌ సినిమాలు ఆడకపోవడం వల్లే అభిమానులు రీమేక్‌లు వద్దు అంటున్నారు. అందుకే పవన్‌ `థెరి` రీమేక్‌ చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమా చేయోద్దని యాష్‌ ట్యాగ్ రూపంలో ట్రెండ్ చేస్తూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చిరంజీవి `భోళాశంకర్‌` కూడా రీమేక్‌ కావడంతో దాన్ని కూడా ఆపేయాలని, డబ్బులు పోతే పోనీగానీ చేసి పరువు తీసుకోవద్దని అంటున్నారు. బాస్‌ ప్లీజ్‌ స్టాప్‌ భోళాశంకర్‌ అంటూ వేడుకుంటున్నారు. వీయ్‌ డోంన్ట్ వాంట్‌ భోళాశంకర్‌ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. 
 

మరి అభిమానుల అభిప్రాయాన్ని కన్సిడర్‌ చేసి రీమేక్‌లు ఆపేస్తారా? లేక లెక్క చేయకుండా ముందుకు వెళ్తారా? అనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. అయితే పవన్‌ రీమేక్‌ చేయడానికి ఓ పర్‌ పస్‌ ఉంది అందుకే ఆయన ముందుకెళ్తున్నారని సమాచారం. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని, అదే సమయంలో షూటింగ్‌ డేట్స్ కూడా త్వరగా ముగించుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారట. మరి రీమేక్‌ విషయంలో చిరంజీవి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఆపేసే ప్రసక్తే లేదని `భోళాశంకర్‌`ని కంప్లీట్‌ చేయాలనే ఆలోచనలోనే చిరు ఉన్నారని సమాచారం. 
 

click me!