పవన్ ఓ ఆణిముత్యం...  అందుకు బాలయ్యే సాక్ష్యం!

Published : Jan 21, 2023, 02:08 PM ISTUpdated : Jan 21, 2023, 02:21 PM IST

టీడీపీతో పొత్తుకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కడిగిన ముత్యంలా నిరూపించగలిగితే పొత్తు వలన ప్రయోజనం ఉంటుంది. దీనిలో భాగంగా ముగ్గురు భార్యలు, ప్యాకేజ్ వంటి అపవాదులు అన్ స్టాపబుల్ వేదికగా తొలగించాలని బాలయ్య ఫిక్స్ అయ్యారు.

PREV
17
పవన్ ఓ ఆణిముత్యం...  అందుకు బాలయ్యే సాక్ష్యం!
UnstoppableWithNBKS2,pawan kalyan

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. రాజకీయాల్లో ఏడాది అంటే స్వల్పకాలమే. ప్రజల విశ్వాసం సాధించిన నాయకులదే విజయం కాబట్టి. దాని కోసం అధికార విపక్షాలు కిందామీదా పడుతున్నాయి. ప్రజాక్షేత్రంలో వైసీపీ బలంగా ఉందని టీడీపీ-జనసేన భావిస్తున్నాయి. పొత్తు పెట్టుకోవడం ద్వారానే వైఎస్ జగన్ ని గద్దె దింపగలమన్న నిర్ణయానికి వచ్చాయి. 

27
chandrabbu-pawan kalyan

2014లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఒంటరిగా బరిలో దిగిన వైసీపీ స్వల్ప ఓట్ల శాతంతో అధికారం కోల్పోయింది. ఈ ఓల్డ్ ఫార్ములా 2024 ఎన్నికలల్లో కూడా ఫలితం ఇస్తుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచన. పొత్తు పెట్టుకున్నంత మాత్రాన అధికారం కచ్చితంగా లభిస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే రాజకీయాల్లో 1+1=2 కాదు. నాలుగు పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ  ప్రజాబలం ఉన్న సింగిల్  పార్టీని ఓడించలేవు. ఇది పలుమార్లు రుజువైంది. 

37
chandrabbu-pawan kalyan


అదే సమయంలో టీడీపీ-జనసేన కూటమిని జనాలు నమ్మాలి. ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టుకున్న పొత్తు కాదు ఏపీ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయమని ఓటర్లకు నచ్చజెప్పాలి. ముఖ్యంగా టీడీపీతో కలవడం అనివార్యం అని జనసైనికులను నమ్మించాలి. ఎందుకంటే జనసేన వర్గాల్లో మెజారిటీ ఒపీనియన్ పొత్తు వద్దనే. 

47


ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ త్యాగాలను, సామాజిక స్పృహను ప్రజలకు తెలియజేశాలి. అదే సమయంలో ఆయనపై ఉన్న అపవాదులు తొలగించాలి.  దానిలో భాగంగానే అన్ స్టాపబుల్ పవన్ ఎపిసోడ్. అధికార పార్టీని దెబ్బతీసేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వాడుకుంటున్నారు. పవన్, బాలయ్యల సినిమాల్లో వై ఎస్ జగన్ ని డైలాగ్స్ రూపంలో నేరుగా తిడుతున్నారు. ''శుక్రవారం వచ్చి సంతకం పెళ్లి వెళ్ళారా నా కొడకా'' వంటి డైలాగ్స్ ఉదాహరణకు మాత్రమే. 
 

57
pawan kalyan -chandrababu 2


టీడీపీతో పొత్తుకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కడిగిన ముత్యంలా నిరూపించగలిగితే పొత్తు వలన ప్రయోజనం ఉంటుంది. ముగ్గురు భార్యలు,పొలిటికల్ ప్యాకేజ్ వంటి అపవాదులు అన్ స్టాపబుల్ వేదికగా తొలగించాలని బాలయ్య ఫిక్స్ అయ్యారు. హృదయాలను తట్టి నమ్మశక్యంగా ఉండేలా సమాధానాలు పవన్ నోటి నుండి రానున్నాయి. 

67
Pawan Kalyan

అలాగే పవన్ సామాజిక భావజాలం నిరూపించాలి. పవన్ ని మొదటి నుండి దేశభక్తి వెంటాడిందని చెప్పాలి. అన్నయ్య, వదినలు ఒత్తిడితో హీరో అయ్యాను కానీ నేను సోషలిస్ట్, కమ్యూనిస్టునే అని చెప్పుకోవాలి. మొత్తంగా పవన్ ని మహానుభావుడిగా ఎలివేట్ చేయాలి. అది అన్ స్టాపబుల్ వేదిక సాక్షిగా అమలుపరచాల్సిన పొలిటికల్ అజెండా..

77


ముఖ్యంగా పవన్ అభిమానిని అని చెప్పుకునే ప్రతివాడు జనసేనకు లేదా జనసేన మద్దతిచ్చిన పార్టీకి ఓటెయ్యాలి. ఓసారి మోసం చేశారు ఈ సారి మాత్రం చెయ్యొద్దని గట్టిగా చెప్పాలి. అది చెప్పేందుకే బాలయ్య... 'మీ అభిమానులు మీకు ఓట్లు ఎందుకు వెయ్యలేదు?' అని పవన్ ని అడిగారు. దీనికి పవన్ సమాధానం ఏమిటో ఫుల్ ఎపిసోడ్లో తెలుస్తుంది. కానీ ఆన్సర్ చాలా సింపుల్... పవన్ ని కనీసం అభిమానులు కూడా నమ్మలేదు. పొత్తుల పరంపరలో జనసేన సిద్ధాంతం ఏమిటో తెలియని ఫ్యాన్స్ కూడా హ్యాండ్ ఇచ్చారు. 

Read more Photos on
click me!

Recommended Stories