లేటు వయసులో భూమిక ఘాటు అందాలు... హాట్ క్లీవేజ్ షోతో సంచలనానికి తెరలేపిన అప్పటి స్టార్ హీరోయిన్

First Published Aug 22, 2021, 11:56 AM IST


మిలీనియమ్ ప్రారంభంలో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది భూమిక చావ్లా.  తెలుగు ప్రేక్షకుల కలల రాణిగా ఆమె కుర్ర హృదయాలను ఏలారు. 
 

2000లో విడుదలైన యువకుడు చిత్రంతో వెండితెరకు పరిచయమైన భూమిక, ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా ఖుషి మూవీలో ఛాన్స్ కొట్టేసింది.

దర్శకుడు సూర్య తెరకెక్కించిన ఖుషి సంచలన విజయం నమోదు చేసుకుంది. మధుమతిగా భూమిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక్కసారిగా భూమిక స్టార్ హోదా పట్టేశారు. 

ఆ తరువాత భూమిక నటించిన ఒక్కడు, సింహాద్రి ఇండస్ట్రీ హిట్స్ అందుకోవడంతో ఆమె ఫేమ్ మరింతగా పెరిగింది. పరిశ్రమలో స్టార్స్ గా ఉన్న ఎన్టీఆర్, మహేష్, పవన్, చిరంజీవిలతో జత కట్టింది భూమిక. 


ఐతే భూమిక కెరీర్ గ్రాఫ్ చాలా త్వరగా పడిపోయింది. ఐదేళ్ల వ్యవధిలోనే ఆమె స్టార్స్ తో నటించే స్థాయి నుండి టూ టైర్ హీరోల రేంజ్ కి పడిపోయారు. కెరీర్ మందగించడంతో 2014లో వివాహం చేసుకున్నారు. 

భూమిక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె హీరోలకు అక్క, వదిన వంటి పాత్రలు చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో భూమిక బాగానే అవకాశాలు పెట్టేస్తున్నారు. 

మిడిల్ క్లాస్ అబ్బాయి, రూలర్, సవ్యసాచి, పాగల్ చిత్రాలలో ఆమె కీలక రోల్స్ చేయడం జరిగింది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటీమార్ మూవీలో భూమిక మరో రోల్ చేస్తున్నారు. 

43ఏళ్ల భూమిక సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తున్నారు. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ తన ఫ్యాన్స్ కి ట్రీట్ పంచుతున్నారు. 

రెడ్ లాంగ్ ఫ్రాక్ లో హాట్ క్లివేజ్ షోతో భూమిక ఘాటు అందాలతో విందు చేయగా, ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి. వెండితెరపై పద్దతిగా నటించిన ఆమె, సోషల్ మీడియాలో తనలోని కొత్త యాంగిల్ పరిచయం చేస్తున్నారు. 

click me!