ఈ సందర్భంగా యువత మేల్కోవాలన్నాడు పల్లవి ప్రశాంత్. యువత బయటకు వస్తే రైతులు బాగుపడతారని తెలిపాడు. రైతుల కోసం యువత ముందుకు రావాలని, ఏ రంగంలోనైనా యువత మేల్కోవాలని తెలిపారు పల్లవి ప్రశాంత్. ఇటీవల ఓ కుటుంబానికి సహాయం చేయడంపై రియాక్ట్ అవుతూ, నాకు లేట్‌గా డబ్బులు వచ్చాయని, అందుకే లేట్ అయ్యిందన్నారు. ఊరు పెద్దలు ఓ ఫ్యామిలీని చూపించారని, వారికి లక్ష రూపాయలు, ఏడాదికి సరిపడ బియ్యం అందించినట్టు తెలిపారు ప్రశాంత్.