ఎన్టీఆర్‌కి `స్టూడెంట్‌ నెం 1` ఆఫర్‌ ఎలా వచ్చిందో తెలుసా?.. రహస్యం బయటపెట్టిన అగ్ర నిర్మాత.. తారక్‌ లక్కీ

First Published Aug 11, 2022, 9:51 PM IST

ఎన్టీఆర్‌ హీరోగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని అందుకున్న చిత్రం `స్టూడెంట్‌ నెం.1`. అయితే ఈ చిత్రానికి మొదట హీరో ఎన్టీఆర్ కాదట. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత అశ్వినీదత్‌ వెల్లడించి షాకిచ్చారు. 

నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్‌(NTR). బాలనటుడిగానే సంచలనాలు క్రియేట్‌ చేసిన ఆయన `నిన్ను చూడాలని` చిత్రంతో హీరోగా డెబ్యూ అయ్యారు. కానీ అదే ఏడాది `స్టూడెంట్‌ నెం1`(Student No 1)తో సూపర్‌ హిట్‌ని అందుకున్నారు తారక్‌. రాజమౌళి(Rajamouli)ని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన చిత్రమిది. ఎన్టీఆర్‌కి బ్లాక్‌ బస్టర్‌ అందించింది వెనక్కి తిరిగి చూసుకోఅవసరం లేకుండా చేస్తుంది. 
 

ఈ సినిమాతో ఎన్టీఆర్‌కి, రాజమౌళి మధ్య ఏర్పడ్డ స్నేహం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు వీరి కాంబినేషన్‌లో నాలుగు సినిమాలు (`స్టూడెంట్‌ నెం.1`, `సింహాద్రి`, `యమదొంగ`, `ఆర్‌ఆర్‌ఆర్‌`) చిత్రాలొచ్చాయి. అన్నీ బ్లాక్‌ బస్టర్‌ హిట్స్ అయ్యాయి.

అయితే ఈ సినిమా సమయంలో హీరోగా ఎన్టీఆర్‌ ని చూసినప్పుడు రాజమౌళి.. ఇతనేంటి హీరో అనుకున్నారట. ఆ విషయాన్ని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ అతని నటన చూశాక ఫిదా అయినట్టు చెప్పారు.  

అయితే ఈ సినిమా వెనకాల మరో రహస్యం ఉందట. తాజాగా ఆ విషయాన్ని అగ్ర నిర్మాత అశ్వినీదత్‌(Ashwinidutt) వెల్లడించారు. ఆ చిత్రాన్ని ఆయనే నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా `అలీతో సరదాగా` షోలో పాల్గొన్న అశ్వినీదత్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. `స్టూడెంట్‌ నెం.1` వెనకాల జరిగిన రహస్యాన్ని బయటపెట్టారు. మొదట ఈ సినిమాలో హీరోగా ఎవరిని అనుకున్నారో తెలిపారు. 
 

ఎన్టీఆర్‌ ఈసినిమాకి మొదటి ఛాయిస్‌ కాదని చెప్పారు. మొదట అనుకున్నది ప్రభాస్‌(Prabhas)తో అని తెలిపారు. డార్లింగ్‌తో సినిమా చేయాలని ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారట. కానీ ఆ సమయంలోనే ఈ సినిమా గురించి తెలుసుకున్న హరికృష్ణ(ఎన్టీఆర్‌ తండ్రి) అశ్వినీదత్‌కి ఫోన్‌ చేసి, ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని రిక్వెస్ట్ చేశారట. దీంతో ప్రభాస్‌ని పక్కన పెట్టి తారక్‌తో ఈ సినిమాని తీశామని తెలిపారు. అది అద్భుతమైన విజయాన్ని సాధించిందని, ఆ సినిమాతో ఎన్టీఆర్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 
 

 ఇక ఇంకా అశ్వినీదత్‌ చెబుతూ, సీనియర్‌ ఎన్టీఆర్‌ని తాను దైవంగా భావిస్తానని తెలిపారు. ఆయనతో సినిమా చేయాలనే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. ఆ కోరిక తీరిందని, అందుకే తన వైజయంతి బ్యానర్‌కి కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ ఫోటోనే పెట్టుకున్నట్టు చెప్పారు అశ్వినీదత్‌. అయితే ఆయన నిర్మాతగా చివరగా ఎన్టీఆర్‌తో చేసిన `శక్తి`(Shakti) చిత్రం చాలా దెబ్బకొట్టిందన్నారు. ఆ సినిమా రిజల్ట్ తో తనలో శక్తి నశించినపోయిన ఫీలింగ్‌ కలిగిందని, ఆ సమయంలోనే తండ్రి చనిపోయారని వెల్లడించారు.

click me!