మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ అప్పుడే.. ఇదిగో క్లారిటీ.. బాలయ్య ప్లాన్‌ ఇదేనా?..

Published : Apr 26, 2024, 05:04 PM ISTUpdated : Apr 26, 2024, 06:50 PM IST

బాలకృష్ణ నటవారసుడుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. కానీ ఈ ఏడాది కూడా నిరాశ తప్పేలా లేదు.   

PREV
18
మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ అప్పుడే.. ఇదిగో క్లారిటీ.. బాలయ్య ప్లాన్‌ ఇదేనా?..
Mokshagna

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాలా కాలంగా వెయిట్‌ చేస్తున్నారు. గత ఐదారేళ్లుగా ఇదిగో ఎంట్రీ, అదిగో ఎంట్రీ అనే వార్తలు వస్తున్నాయి. అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. కొడుకుని ఎప్పుడు లాంఛ్‌ చేయిస్తున్నాడో బాలయ్య చెప్పడంలో లేదు. ఆ మధ్య త్వరలోనే ఎంట్రీ ఉంటుందన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. 
 

28

మోక్షజ్ఞ ఇటీవల చాలా మారిపోయాడు. కాస్త స్లిమ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో యాక్టింగ్‌ కోర్స్ చేస్తున్నట్టు సమాచారం. హైలీ స్కిల్డ్ ట్రైనింగ్‌ సెంటర్‌లో మోక్షజ్ఞకి శిక్షణ ఇస్తున్నారు. గతేడాది నుంచి ఆయన అందులోనే శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో త్వరలోనే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఉంటుందని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వెయిట్‌ చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. దాని ఊసే లేదు.  

 

38

చూడబోతుంటే ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోదని తెలుస్తుంది. మోక్షజ్ఞ ఇంకా ట్రైనింగ్‌లోనే ఉన్నారు. ఆయనతో సినిమాకి సంబంధించిన అప్‌ డేట్‌ లేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. అప్పట్లో బాలయ్య కూడా అదే చెప్పాడు. కానీ బాలయ్య స్క్రిప్ట్ సిద్ధం చేశాడా అనేది పెద్ద ప్రశ్న. 

48

మరోవైపు `ఆదిత్య 369`కి సీక్వెల్‌ని చేస్తామని, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి `ఆదిత్య 999` చేయాలనే ఆలోచన ఉన్నట్టు బాలయ్య తెలిపారు. ఈ మూవీ స్క్రిప్ట్ ని బాలయ్యనే రెడీ చేస్తున్నారట. అంతేకాదు స్వయంగా తనే దర్శకత్వం వహిస్తానని కూడా చెప్పారు. మరి ఇది ఎంత వరకు వచ్చిందనేది పెద్ద ప్రశ్న. 
 

58

బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. బాబీ డియోల్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. షూటింగ్‌ అవడానికి చాలా టైమ్‌ పడుతుంది. ఈ మూవీ వస్తే ఈ దసరా, దీపావళికి రావాలి. లేదంటే వచ్చే సంక్రాంతికి రావాల్సి వస్తుంది. దీనిపై క్లారిటీ లేదు. కానీ షూటింగ్‌ డిలే అయ్యే ఛాన్స్ ఉంది. 
 

68
Balakrishna

ప్రస్తుతం పాలిటికల్‌గా బిజీగా ఉన్నారు బాలయ్య. ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయంగా బిజీగా ఉన్నారు బాలయ్య. మరో నెల రోజుల వరకు ఆయన షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. ఎన్నికల ఫలితాల అనంతరం సెట్‌కి వెళ్లే అవకాశం ఉంది. అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో సినిమా షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఉంటుంది. బాబీ సినిమా అయిపోయాక.. నెక్ట్స్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయాల్సి ఉంది. 

78

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో `అఖండ2` సినిమా చేయాల్సి ఉంది. దీన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక షూటింగ్‌ ప్రారంభించడమే మిగిలి ఉంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో దీన్ని ప్రారంభిస్తారు. ఈ ఏడాది అంతా బాలయ్య..బాబీ, బోయపాటిల సినిమాలకే ఫిక్స్ అయిపోతాడు. ఆయన ఎప్పుడు తన స్క్రిప్ట్ ని రెడీ చేస్తాడు, ఎప్పుడు డైరెక్ట్ చేస్తాడనేది పెద్ద ప్రశ్న. 
 

88

దీనికితోడు బోయపాటితో మోక్షజ్ఞ హీరోగా సినిమా ప్రారంభం కావాలన్నా మరో ఏడాది అవుతుంది. బాలయ్య సినిమా పూర్తయ్యాకే తనయుడి సినిమా చేయగలడు బోయపాటి. ఇది కాకపోతే `అఖండ2`లో ఏదైనా పాత్ర ద్వారా సినిమా తెరంగేట్రం చేయించాల్సి ఉంటుంది. కానీ బాలయ్య తన ఒక్క కొడుకు హీరోగా సినిమాని గ్రాండ్‌గా లాంచ్‌ చేయాలనుకుంటాడు. తన సినిమాతో పరిచయం చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉండదని అర్థమవుతుంది. నందమూరి ఫ్యాన్స్ కి నిరీక్షణ మాత్రం తప్పడం లేదు.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories