ధోని, విరాట్, రోహిత్ శర్మల బ్యాటింగ్ కి సూటయ్యే బాలయ్య డైలాగ్స్... స్వయంగా చెప్పిన నందమూరి హీరో!

By Sambi ReddyFirst Published Apr 26, 2024, 9:38 AM IST
Highlights

బాలకృష్ణ ఈ మధ్య బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్నారు. తాజాగా ఆయన స్టార్ క్రికెటర్స్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాటింగ్ కి సూట్ అయ్యే తన డైలాగ్స్ చెప్పాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. 
 


హోస్ట్ గా బెస్ట్ అనిపించాడు బాలకృష్ణ. విమర్శకుల నోళ్లు మూపించాడు. ఆహా లో ప్రసారమైన అన్ స్టాపబుల్ గ్రాండ్ సక్సెస్. భారీ టీఆర్పీ రాబట్టింది ఈ టాక్ షో. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ ఈ షోకి గెస్ట్స్ గా రావడం కొసమెరుపు. అలాగే బాలకృష్ణ స్టార్ మా లో ప్రసారం అయ్యే ఐపీఎల్, ప్రో కబడ్డీ వంటి మెగా స్పోర్ట్స్ ఈవెంట్స్ కి ప్రమోటర్ గా వ్యవహరిస్తున్నారు. బాలయ్యలో స్పోర్ట్స్ మ్యాన్ కూడా. బాలయ్య స్పిన్ బౌలర్. 

ఇదిలా ఉంటే ఇండియన్ స్టార్ క్రికెటర్స్ మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బ్యాట్ పడితే పరుగుల వరద పారించే ఈ ముగ్గురు బ్యాట్స్ మెన్ పేరిట అనేక రికార్డులు ఉన్నాయి. కాగా బాలకృష్ణ వీరికి సూట్ అయ్యే తన సినిమాల్లోని డైలాగ్స్ చెప్పి మెస్మరైజ్ చేశాడు. బాలయ్యను ధోని, విరాట్, రోహిత్ శర్మలకు సెట్ అయ్యే తన డైలాగ్ చెప్పాలని కోరింది. 

ధోనీకి గాను.. డు నాట్ ట్రబుల్ ది ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ది ట్రబుల్, ఐ యామ్ ది ట్రూత్' అనే డైలాగ్ సెట్ అవుతుందని బాలయ్య చెప్పారు. నెక్స్ట్ విరాట్ కోహ్లీకి సూట్ అయ్యే డైలాగ్ చెప్పమనగా... 'ఎవడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్కూ, నేను ఎవడికి ఎదురెళ్ళినా వాడికే రిస్కూ... తొక్కిపడేస్తా'  అనే డైలాగ్ డేడికేట్ చేశాడు. 

ఇక చివరిగా రోహిత్ శర్మకు సూట్ అయ్యే డైలాగ్ చెప్పమని అడగ్గా... ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు' అనే డైలాగ్ చెప్పాడు. బాలయ్య వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు బాబీతో 109వ చిత్రం చేస్తున్నారు. 
 

click me!