ఎలక్షన్ ప్రచారంలో హీరో నిఖిల్

By Surya PrakashFirst Published Apr 26, 2024, 8:35 AM IST
Highlights

 నిఖిల్‌తో ఫొటోలు దిగేందుకు జ‌నాలు ఎగ‌బడ్డారు. ఆయ‌న కూడా వారితో చేతులు క‌లిపి, సెల్ఫీలు దిగారు. 


సినిమా వాళ్లు మెల్లిమెల్లిగా ఎలక్షన్ క్యాంపైన్ లోకి దూకుతున్నారు.  బాప‌ట్ల జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గ‌ ఎన్‌డీఏ కూట‌మి అభ్య‌ర్థి ఎం కొండ‌య్యకు మ‌ద్ద‌తుగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నాడు. కొండ‌య్య గురువారం చీరాల అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అంత‌కుముందు ఆయ‌న చీరాల మండ‌ల ప‌రిధిలోని హస్తినాపురంలోని గ‌ణేశుడి ఆల‌యం నుంచి చీరాల వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వ‌హించ‌డం జ‌రిగింది. 

 ర్యాలీలో సినీనటుడు నిఖిల్‌ సిద్దార్థ, తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. దీంతో చీరాల పట్టణం పసుపుమయమైంది. ఈ సందర్భంగా గడియార స్తంభం కూడలిలో నిఖిల్‌ మాట్లాడుతూ.. చిరు నవ్వుల చీరాల కావాలంటే కొండయ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.  

 ఈ సంద‌ర్భంగా నిఖిల్‌తో ఫొటోలు దిగేందుకు జ‌నాలు ఎగ‌బడ్డారు. ఆయ‌న కూడా వారితో చేతులు క‌లిపి, సెల్ఫీలు దిగారు. ఈ ర్యాలీలో భాగంగా గ‌డియార స్తంభం కూడ‌లిలో నిఖిల్ ప్ర‌సంగించారు. చిరు న‌వ్వుల చీరాల కావాలంటే కూట‌మి అభ్య‌ర్థి కొండ‌య్య‌కు ఓటు వేసి గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి చంద్ర‌బాబు నాయుడుతోనే సాధ్య‌మ‌ని నిఖిల్ అన్నారు.

ఇక నిఖిల్ సోదరిని మాలకొండయ్య యాదవ్ పెద్ద కుమారుడుఅమర్‌నాథ్‌కు ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధుత్వం ఉంది. మరోవైపు మద్దులూరి మాలకొండయ్య యాదవ్ అలియాస్ ఎంఎం కొండయ్యకు 15 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది. అంతేకాదు విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ రంగంలోనూ మాలకొండయ్య యాదవ్ పేరు సంపాదించుకున్నారు. ఇక 2009 ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఒంగోలు ఎంపీ సీటుకు పోటీ చేసి మాలకొండయ్య ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీలో చేరారు.

చీరాల అసెంబ్లీ సెగ్మెంట్లో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా మాలకొండయ్యకు చంద్రబాబు అవకాశం కల్పించారు. అటు వైసీపీ కరణం బలరాంకు బదులుగా ఆయన తనయుడు కరణం వెంకటేశ్‌కు వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. మామ తరుఫున నిఖిల్ ప్రచారం చేస్తున్నారు.
 

click me!