ఫోటోగ్రాఫర్ కి మాత్రమే తెలిసిన నిహారిక పెళ్లి రహస్యం... ఎవరికీ చెప్పొదంటుంది!

First Published Jan 20, 2021, 1:12 PM IST

కొత్త పెళ్లికూతురు నిహారిక లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది. తన పెళ్లి గురించిన ఒక సీక్రెట్...  ఫోటో గ్రాఫర్ జోసెఫ్ రాడిక్ కి మాత్రమే తెలుసు అంటుంది. ఆ రహస్యం ఏమిటో ఎవరికీ చెప్పనని నిహారిక అనడం ఫ్యాన్స్ ని సస్పెన్సులో పడవేసింది. 
 

జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక వివాహం ఘనంగా జరిగింది. ఈ మెగా పెళ్లి వేడుకకు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ వేదిక కాగా, మెగా హీరోలందరూ పాల్గొని సందడి చేశారు. నిహారిక వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
undefined
ఇక నిహారిక పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అయ్యాయి. పెళ్లిలోని అరుదైన క్షణాలను సహజంగా తన కెమెరాలో బంధించి, ఫోటోగ్రాఫర్ జోసెఫ్ తన టాలెంట్ చూపించాడు.
undefined
సెలెబ్రిటీ ఫోటోగ్రాఫర్ అయిన జోసెఫ్ నిహారిక పెళ్లిని తన ఫొటోలతో అద్భుతంగా మలిచాడు.
undefined
తాజాగా నిహారిక రెండు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ' నా దగ్గర ఓ రహస్యం ఉంది... అది చెప్పేస్తే రహస్యం ఎలా అవుతుంది?, కానీ జోసెఫ్ కి మాత్రం ఆ రహస్యం తెలుసు' అని కామెంట్ చేశారు.
undefined
పెళ్లి బట్టలలో నోటిఫై వేలు పెట్టి ఇష్.. అంటున్న నిహారిక ఫోటో మెస్మరైజ్ చేస్తుంది. మరో ప్రక్క నిహారిక దాస్తున్న, జోసెఫ్ కి మాత్రమే తెలిసిన ఆ రహస్యం ఏమిటని ఫ్యాన్స్ బుర్ర గోక్కుంటున్నారు.
undefined
ఇక సంక్రాంతి వేడుకలు కుటుంబ సభ్యులతో జరుపుకున్న ఈ కొత్త జంట, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వీరిద్దరికి పెళ్ళై నెల రోజులు పూర్తి కావడం జరిగింది.
undefined
మరోవైపు పెళ్లి తరువాత కూడా యాక్టింగ్ ప్రొఫెషన్ ఆమె కొనసాగిస్తున్నారు.  అనసూయతో కలిసి నిహారిక ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
undefined
ఇటీవలే ఈ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పెళ్లి తరువాత నిహారిక నటిస్తున్న వెబ్ సిరీస్ లో ఆమె పాత్ర ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొని ఉంది.
undefined
click me!