అభిమానులతో నందమూరి మోక్షజ్ఞ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫ్యాన్స్ కి సూపర్ కిక్కు

First Published Sep 6, 2021, 3:42 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఎప్పుడూ కెమెరా ముందుకు రాని మోక్షజ్ఞ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో కనిపించాడు. 

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఎప్పుడూ కెమెరా ముందుకు రాని మోక్షజ్ఞ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో కనిపించాడు. 

మోక్షజ్ఞ పుట్టినరోజు నేడు. దీనితో అభిమానులు మోక్షజ్ఞకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా నందమూరి అభిమాన సంఘ నాయకులు కొందరు నేరుగా బాలయ్య ఇంటికి వెళ్లి మోక్షజ్ఞ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. 

దీనితో మోక్షజ్ఞ అభిమానులతో కలసి బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకున్నాడు. కేక్ కట్ చేసిన మోక్షజ్ఞ.. అభిమానుల నుంచి బొకేలు అందుకున్నాడు. అభిమానులు మోక్షజ్ఞని ఆప్యాయంగా విష్ చేశారు. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

మోక్షజ్ఞ అభిమానులకు కనిపించడం చాలా అరుదు. అలాంటిది తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మోక్షజ్ఞ కనిపించడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోతోంది. 

మోక్షజ్ఞ బర్త్ డే సీడీపీని దర్శకుడు గోపీచంద్ మలినేని లాంచ్ చేశారు. బాలయ్య తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనే ఉండబోతోంది. 

మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. కానీ అది వాయిదా పడుతూనే ఉంది. ఈ ఏడాది అయినా మోక్షజ్ఞ తొలి చిత్రం ఉంటుందేమోనని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. 

ఆ మధ్యన మోక్షజ్ఞకు సినిమాలు అంటే ఆసక్తి లేదని.. అతడి మనసు మార్చేందుకు బాలయ్య ప్రత్యేక పూజలు చేయించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 
 

click me!