నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 యమా క్రేజీగా దూసుకుపోతోంది. ఎప్పుడూ కెమెరా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వని బిగ్ స్టార్స్ కూడా బాలయ్య షోకి హాజరవుతున్నారు. ఆసక్తిరేకెత్తించే ప్రశ్నలు.. వినోదాన్ని అందించే అల్లరితో అన్ స్టాపబుల్ దూసుకుపోతోంది. బాలయ్య షోకి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, విశ్వక్ సేన్, శర్వానంద్, అడివి శేష్ లాంటి హీరోలు హాజరయ్యారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ షోలో మెరిశారు.