నాగ్ అశ్విన్ సృష్టించిన సరికొత్త ప్రపంచం `కల్కి 2898ఏడీ`. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, దీపికా పదుకొనె, దుల్కర్ సల్మాన్, శోభన వంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు సునామీ సృష్టిస్తుంది. మొదటి వారంలో ఇది 700కోట్ల క్లబ్‌లోకి చేరింది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కాగా, మరికొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్తుంది. నార్త్ అమెరికాలో అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. ఈ వారంలో అన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. బయ్యర్లకి, ఎగ్జిబిటర్లకి లాభాల పంట పండించబోతుందని అర్థమవుతుంది.