ఆ స్టార్ హీరోయిన్ కి అంత తలపొగరా, వెంకటేష్ ని కూడా అవమానించిందా... డైరెక్టర్ బయటపెట్టిన షాకింగ్ నిజాలు!

Published : Jul 05, 2024, 06:35 PM IST

వెంకటేష్ టాలీవుడ్ బడా హీరోల్లో ఒకరు. దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఆయన తండ్రి రామానాయుడు మూవీ మొఘల్. ఘన చరిత్ర కలిగిన నిర్మాత. అలాంటి వెంకటేష్ ని కూడా లెక్క చేయలేదట ఓ హీరోయిన్.   

PREV
16
ఆ స్టార్ హీరోయిన్ కి అంత తలపొగరా, వెంకటేష్ ని కూడా అవమానించిందా... డైరెక్టర్ బయటపెట్టిన షాకింగ్ నిజాలు!
Venkatesh Daggubati

లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు చిన్న కుమారుడైన వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్యారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున... నాలుగు స్తంభాలుగా దశాబ్దాల పాటు టాలీవుడ్ ని ఏలారు. ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ కి బలం. ఒక దశలో వరుస విజయాలతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్నాడు.

26

అంతటి బ్యాక్ గ్రౌండ్ కలిగిన హీరోని ఓ హీరోయిన్ లెక్క చేయకపోవడం ఊహించని పరిణామం. ఆమె ఎవరో కాదు నయనతార. ఈమెకు చాలా పొగరు అనే నానుడి ఉంది. హీరో ఎవరైనా కానీ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనదు. షూటింగ్ అయిపోతే సినిమాతో నాకు సంబంధం లేదు అంటుంది. స్టార్డమ్ బాగా తలకు ఎక్కించుకున్న హీరోయిన్ ఆమె.

36

కెరీర్ బిగినింగ్ లో వెంకటేష్ కి జంటగా రెండు చిత్రాలు చేసింది నయనతార. లక్ష్మి, తులసి చిత్రాల్లో వెంకటేష్-నయనతార జతకట్టారు. ముచ్చటగా మూడోసారి బాబు బంగారం చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్ర షూటింగ్ లో నయనతార ప్రవర్తన దర్శకుడు మారుతికి చిరాకు తెప్పించిందట. చివరకు వెంకటేష్ ని కూడా ఆమె గౌరవించేవారు కాదట. 
 

46


దర్శకుడు మారుతి ఓ సందర్భంలో మాట్లాడుతూ... బాబు బంగారం యూనిట్ కి నయనతార అసలు సహకరించేవారు కాదు. నేను చిన్న దర్శకుడిని అని లెక్క లేకుండా ఉండేది. నా విషయం పక్కన పెడితే వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ కి కూడా ఆమె గౌరవం ఇచ్చేది కాదు. వెంకటేష్ ని నయనతార కొన్నిసార్లు లెక్క చేయకపోవడంతో ఉండబట్టుకోలేక నయనతారతో గొడవపడ్డాను. 
 

56

బాబు బంగారం మూవీ క్లైమాక్స్ లో ఓ సాంగ్ ఉంటుంది. ఆ పాట చేయను అని నయనతార తెగేసి చెప్పింది. నాకు ఇతర మూవీ కమిట్మెంట్స్ ఉన్నాయి. డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పింది. ఎంత బ్రతిమిలాడినా నయనతార ఆ సాంగ్ చేయలేదు. చివరికి పాట లేకుండానే మూవీ విడుదల చేశాము. వెంకటేష్ ని కూడా నయనతార గౌరవించకపోవడం నన్ను ఆవేదనకు గురి చేసిందని మారుతీ అప్పటి సంఘటనలు గుర్తు చేసుకున్నాడు.. 

66

నయనతార మీద చాలా మంది దర్శకులు ఫిర్యాదు చేశారు. కానీ ఆమెకున్న ఫేమ్ రీత్యా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. 2022లో నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకుంది. వీరికి కవలలు సంతానం. సరోగసి పద్దతిలో నయనతార అయ్యారు. ఇది వివాదాస్పదం అయ్యింది. 
నయనతార, వెంకటేష్ దగ్గుబాటి, డైరెక్టర్ మారుతి, బాబు బంగారం, 

Read more Photos on
click me!

Recommended Stories