మరో హీరోయిన్ తో ఎఫైర్, డ్రగ్స్ కేసులో ఇరికించాడు... రాజ్ తరుణ్ పై యువతి ఫిర్యాదు!

By Sambi ReddyFirst Published Jul 5, 2024, 2:42 PM IST
Highlights

తనను శారీరకంగా వాడుకుని వదిలేశాడని ఓ యువతి హీరో రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది. వేరే హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజా పరిణామం కలకలం రేపుతోంది... 
 

హీరో రాజ్ తరుణ్ అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన మీద లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం... లావణ్యతో 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది. గుడిలో లావణ్యను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడు నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు. 

ఈ కారణంగా లావణ్యను దూరం పెడుతున్నాడు. తన వెంటపడొద్దని, వదిలేయకపోతే చంపి... శవం మాయం చేస్తానని బెదిరించాడు. గతంలో లావణ్యను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ కేసులో ఇరికించాడు. ఈ కేసులో లావణ్య 45 రోజులు జైల్లో ఉంది. అప్పుడు కూడా రాజ్ తరుణ్ ఆమెకు ఎలాంటి సహాయం చేయలేదు. నాకు రాజ్ తరుణ్ కావాలి అంటున్న లావణ్య... న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆమె కేసు ఫైల్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

గతంలో కూడా రాజ్ తరుణ్ పలు వివాదాల్లో ఇరుక్కున్నాడు. 2019లో రాజ్ తరుణ్ మద్యం మత్తులో తన కారును వేగంగా నడిపి యాక్సిడెంట్ చేశాడు. అనంతరం కారు అక్కడే వదిలి పారిపోయాడు. రాజ్ తరుణ్ పారిపోతున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో నమోదయ్యాయి. తాజాగా రాజ్ తరుణ్ పై చీటింగ్ కేసు ఫైల్ అయ్యింది. 

రాజ్ తరుణ్ ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో ఒక స్థాయికి ఎదిగాడు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోగా మారాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కిన ఆ చిత్రం సూపర్ హిట్. కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్త మావా చిత్ర విజయాలు రాజ్ తరుణ్ కి యూత్ లో పాపులారిటీ తెచ్చాయి. మొదట్లో మెరుపులు మెరిపించిన రాజ్ తరుణ్, వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. 

ప్రస్తుతం ఆయన కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడర సామీ విడుదలకు సిద్ధం అవుతుంది. యజ్ఞం ఫేమ్ ఏఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా ఈ వివాదంలో చిక్కుకున్నాడు. మరి రాజ్ తరుణ్ యువతి ఆరోపణల మీద ఎలా స్పందిస్తారో చూడాలి..

click me!