అంబానీ చిన్న కుమారుడు పెళ్లికి ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఈ వేడుకకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వారణాసిలోని పాపులర్ కాశీ చాట్ భండార్ నుండి ఒక చాట్ స్టాల్ వివాహ రిసెప్షన్‌కు పెట్టనున్నట్లు సమాచారం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జులై 12న జరగనుంది. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ కుమారుడి వివాహానికి గ్రాండ్‌గా రిసెప్షన్‌ను సిద్ధం చేస్తున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనుంది.
అయితే పెళ్లికి ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఈ వేడుకకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వారణాసిలోని పాపులర్ కాశీ చాట్ భండార్ నుండి ఒక చాట్ స్టాల్ వివాహ రిసెప్షన్‌కు పెట్టనున్నట్లు సమాచారం.
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్మన్ నీతా అంబానీ జూన్‌లో కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లి ఫస్ట్ పెళ్లి కార్డును అందించారు. దీని తర్వాత నీతా అంబానీ అనేక మంది కళాకారులతో కలిసి కాశీని సందర్శించారు. నీతా చాట్ విక్రేతలను కూడా కలిశారని సమాచారం. నీతా అంబానీ రకరకాల చాట్‌లను టెస్ట్ చేసిన తర్వాత షాప్‌కీపర్ రాకేష్ కేసరిని పెళ్లికి ఆహ్వానించినట్లు సమాచారం. దింతో టికి, టొమాటో చాట్, పాలక్ చాట్, చానా కచోరీ, కుల్ఫీలతో కూడిన చాట్ స్టాల్‌ను రెడీ చేసేందుకు కేసరి బృందం సిద్దమైనట్లు నివేదించారు.
"నీతా అంబానీ జూన్ 24న మా చాట్ భండార్‌కి వచ్చి టిక్కీ చాట్, టొమాటో చాట్, పాలక్ చాట్, కుల్ఫీ ఫలూదాను రుచి చూసి చాలా సంతోషించారు. బనారస్‌లో ఈ చాట్ చాలా పాపులారిటీ చెందింది. అంబానీ ఫ్యామిలీ ఫంక్షన్‌కు మా చాట్ అందించడం సంతోషంగా ఉంది" అని కేసరి చెప్పారు.
నీతా అంబానీ సందర్శన తర్వాత, ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు ఈ చార్ భండారుకి తరలి రావడంతో మరింత ప్రజాదరణ పొందింది.