భారతీయుడు 2 సెన్సార్ డీటెయిల్స్.. కల్కి బాటలోనే, రన్ టైం ఎంతో తెలుసా

Published : Jul 05, 2024, 05:52 PM IST
భారతీయుడు 2 సెన్సార్ డీటెయిల్స్.. కల్కి బాటలోనే, రన్ టైం ఎంతో తెలుసా

సారాంశం

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురుచూస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. శంకర్ చిత్రాలు సహజంగానే ఎక్కువ లెన్త్ తో ఉంటాయి. ఇటీవల వస్తున్న భారీ చిత్రాలన్నీ లాంగ్ రన్ టైం తో వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, కల్కి చిత్రాల రన్ టైం 3 గంటలు దాటిపోయింది. 

ఇప్పుడు అదే బాటలో భారతీయుడు 2 కూడా వస్తోంది. భారతీయుడు 2 రన్ టైమ్ 3 గంటల 4 నిముషాలు ఉండబోతోందట. కమల్ హాసన్ చివరగా ప్రభాస్ కల్కి చిత్రంలో యాస్మిన్ గా విచిత్రమైన పాత్రలో నటించారు. ఇప్పుడు భారతీయుడిగా విన్యాసాలు చేయబోతున్నారు. ఇలా ప్రయోగాలు చేస్తూ మెప్పించడం కమల్ శైలి. 

అయితే 1996లో వచ్చిన భారతీయుడు చిత్రాన్ని మురిపించేలా భారతీయుడు 2 ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల శంకర్ ఫామ్ కూడా ఆశాజనకంగా లేదు. ఆయన పెద్ద దర్శకుడు అయినప్పటికీ తడబడుతున్నారు. అలాంటివి ఏమీ జరగకుండా భారతీయుడు 2 మెప్పించాలని అంతా కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్
800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?