‘నాగినీ’ సీరియల్ తో నటి మౌనీరాయ్ (Mouni Roy) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అప్పట్లో బుల్లితెరపై ఈ ముద్దుగుమ్మ సంచలనంగా మారింది. దాంతో మరిన్ని సీరియల్స్ తో పాటు, సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ వచ్చింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల జోరు పెద్దగా లేదు. కానీ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూనే వస్తోంది. చివరిగా ఈ బ్యూటీ ‘బ్రహ్మస్త్రం’ చిత్రంతో వెండితెరపై అలరించింది. నెగెటివ్ షెడ్స్ గల పాత్రలో ఆకట్టుకుంది.
సినిమాల విషయం అటుంచితే.. మౌనీరాయ్ అభిమానులకు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. తన సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. గ్లామర్ షోతోనూ రచ్చ చేస్తోంది.
గతేడాది తన వివాహం సూరజ్ నంబియార్ తో జరిగింది. ఆ తర్వాత నుంచి కెరీర్ పై కంటే ఫ్యామిలీపైనే కాస్తా శ్రద్ధ వహిస్తోంది. టూర్లు, వెకేషన్లకు వెళ్తూ సందడి చేస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
మరోవైపు మౌనీరాయ్ లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూ గ్లామర్ విందు చేస్తూ వస్తోంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తుంది. తాజాగా బిగుతైన డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. థైస్ షోతో మతదులు పోగొట్టింది.
పెళ్లి తర్వాత మౌనీ రాయ్ మ్యారీడ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తూనే... ఇలా కిర్రాక్ అవుట్ ఫిట్లలో గ్లామర్ విందుతో మతులు పోగొడుతోంది. లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులను పరిచయం చేస్తూనే గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. నెటిజన్లను మైమరిపిస్తోంది.