మా ఎలక్షన్స్: అప్పుడు చిరు,మురళీమోహన్, నాగబాబు ఏం చేశారు? దీని వెనుక కుట్ర ఉంది- నరేష్

First Published Jul 2, 2021, 7:51 AM IST


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ టాలీవుడ్ లో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోటీదారుగా ఉన్న ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసు ప్రస్తుత అధ్యక్షుడు, కమిటీ సభ్యుల పనితీరుపై ఆరోపణలు చేయడం జరిగింది. 
 

నాగబాబు సైతం గత నాలుగేళ్లుగా 'మా' ప్రతిష్ట మసకబారిందని తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది.  ప్రకాష్ రాజ్, నాగబాబు వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మా అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్ వాళ్లకు మీడియా వేదికగా సమాధానం చెప్పారు. గత రెండేళ్ల 'మా'  చేసిన సంక్షేమ కార్యక్రమాల చిట్టా విప్పారు. 'మా' కమిటీ సభ్యుల మధ్య విభేధాలు ఉన్నాయన్న విషయంపై నరేష్ మరోమారు స్పందించారు.

maa

ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.  12ఏళ్లుగా మా లో వివిధ శాఖలలో పనిచేశాను, మా అధ్యక్షుడిగా సభ్యుల సంక్షేమానికి పెద్ద పీట వేశాము. దేశంలో ఏ అసోసియేషన్ లో లేని విధంగా భీమా సౌకర్యం కలిపించాం. కొందరికి పింఛన్లు ఇస్తున్నాం అన్నారు.
undefined
చిరంజీవి, నాగబాబు, మురళిమోహన్ లాంటి వారు మా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏం చేశారో.. మేము ఏం చేశామో .. శాస్త్రీయంగా అధ్యనం చేయమనండి అన్నారు.
undefined
మా ప్రతిష్ట్మాక సంస్థ దాని గౌరవం పెంచడానికి ఎంతో కష్టపడ్డాను. కానీ నరేష్ వలన మా గౌరవం మసకబారింది, ఆయన అందరినీ కలుపుకు పోవడం లేదు అనే మాటలు బాధించాయి. నేను ట్రైన్ ఎక్కో, బస్ ఎక్కో పరిశ్రమకు రాలేదు. పరిశ్రమలో పుట్టాను అన్నారు.
undefined
మా లో విభేదాలు ఎప్పటి నుండో ఉన్నాయి. గతంలో మురళీమోహన్-నాగబాబు, రాజేంద్రప్రసాద్-జయసుధ గారికి మధ్య విబేధాలు తలెత్తాయి. అయితే అప్పట్లో మీడియా ఇంత యాక్టీవ్ గా లేదు.
undefined
గతంలో కొందరు నాకు, రాజశేఖర్‌కు మధ్య విభేదాలు సృష్టించారు. ఆలోచిస్తే దీని వెనక ఒక హిడెన్‌ ఎజెండా ఉందనిపిస్తుంది. నాకు కొంత మందిని శత్రువులుగా తయారుచేశారు. వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
undefined
900 మంది మా సభ్యులను అయోమయానికి గురి చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు నేను ఎందుకు మౌనంగా ఊరుకోవాలి? మేము చేసిన మంచి పనులను తుడిచిపెట్టేయాలని ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఈ హిడెన్‌ ఎజెండా వెనక ఎవరున్నారు? 'మా'లో చిచ్చు రేపాలనుకుంటున్న బిగ్‌బాస్‌ ఎవరు? అని నేను ప్రశ్నిస్తున్నా. 'మా' అసోషియేషన్‌కు ఒక మంచి ప్రెసిడెంట్‌ కావాలి. దాని కోసమే నేను పోరాడుతున్నా.  అన్నారు నరేష్
undefined
click me!