Hebah Patel: రూటు మార్చిన హాట్ బ్యూటీ హెబ్బా... ట్రెడిషనల్ లుక్ లో సరికొత్తగా తయారైన కుమారి 21ఎఫ్ భామ

Published : Jan 10, 2023, 10:06 AM IST

హీరోయిన్ హెబ్బా పటేల్ రూటు మార్చారు. హాట్ బ్యూటీ కాస్త ట్రెడిషనల్ గా మారిపోయింది. చీర కట్టులో హెబ్బా లుక్ సరికొత్తగా ఉంది.   

PREV
15
Hebah Patel: రూటు మార్చిన హాట్ బ్యూటీ హెబ్బా... ట్రెడిషనల్ లుక్ లో సరికొత్తగా తయారైన కుమారి 21ఎఫ్ భామ
Hebah Patel

హెబ్బా లక్ కలిసిరాక రేసులో వెనుకబడిపోయింది. గొప్ప ఆరంభం లభించినప్పటికీ ఉపయోగించుకోలేక పోయింది . ప్రస్తుతం హెబ్బా ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. మహారాష్ట్రకు చెందిన హెబ్బా... కన్నడ పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. తెలుగులో అలా ఎలా? అనే ఓ చిన్న చిత్రం చేశారు. అయితే సుకుమార్ ఆమెకు గొప్ప ఆఫర్ ఇచ్చాడు. ఆయన నిర్మాతగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. 
 

25
Hebah Patel

దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ భారీ విజయం సాధించింది. న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం యూత్ కి బాగా నచ్చింది. ముఖ్యంగా హెబ్బా నటనతో మాయ చేసింది. యువత ఆమె ప్రేమలో పడిపోయారు. దేవిశ్రీ సాంగ్స్ మరింత ప్లస్ అయ్యాయి. ఆ చిత్ర సక్సెస్ తో హెబ్బా కెరీర్ మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుందని అందరూ భావించారు. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడిన హెబ్బాను వరుస పరాజయాలు పలకరించాయి. 
 

35
Hebah Patel


హెబ్బా పటేల్ కి కుమారి 21ఎఫ్ రేంజ్ హిట్ పడలేదు. అనూహ్యంగా టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. వరుణ్ తేజ్ కి జంటగా మిస్టర్ మూవీ చేసింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆ చిత్రం అట్టర్ ప్లాప్. ఆమె కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది. 
 

45
Hebah Patel

ఈ క్రమంలో హెబ్బా(Hebah Patel) బరువు పెరిగి షేప్ అవుట్ అయ్యారు. రెడ్ మూవీలో రామ్ పోతినేనితో ఐటెం నెంబర్ చేసింది. ఆ సాంగ్ లో హెబ్బాను చూసి ప్రేక్షకులు ఖంగుతిన్నారు. అసలు ఈమె కుమారి 21ఎఫ్ హీరోయినేనా అని సందేహాలు కలిగాయి. అంతగా ఆమె మారిపోయారు. గ్లామర్ ఫీల్డ్ లో షేప్ అవుట్ అయితే కెరీర్ ముగిసినట్లే. హెబ్బా కష్టపడి బరువు తగ్గారు.

55
Hebah Patel

అడపాదడపా ఆఫర్స్ వస్తున్నా స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓటీటీ సినిమాలు, సిరీస్లు, చిన్న సినిమాలు చేసుకుంటూ కెరీర్ బండిని అలా నడిపిస్తుంది.  మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ప్రదర్శిస్తుంది. ఇంస్టాగ్రామ్ లో తరచుగా బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తున్నారు హెబ్బా. ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించే హెబ్బా... రూటు మార్చి సాంప్రదాయ చీరకట్టులోకి మారారు. హెబ్బా ట్రదితిఒనల్ లుక్ వైరల్ గా మారింది. ఫ్యాన్స్ చాలా కొత్తగా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.

click me!

Recommended Stories