బాలీవుడ్ ఆఫర్స్ ను వదులుకుంటున్న కృతిశెట్టి.. గట్టి రీజనే చెబుతోంది.!

First Published Aug 8, 2022, 2:37 PM IST

‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) బాలీవుడ్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన నిర్ణయాన్ని బయటపెట్టింది.
 

కుర్ర హీరోయిన్ కృతి శెట్టి పేరు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ మారుమోగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న  ఈ బ్యూటీ.. వరుస చిత్రాల్లో నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. ప్రస్తుతం బేబమ్మ ఇండస్ట్రీలో రాకెల్ వేగంతో దూసుకెళ్తొంది.
 

ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న కృతి శెట్టి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఇటీవలనే టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని సరసన ‘ది వారియర్’ చిత్రంలో నటించింది. ఈ మూవీలో పెర్పామెన్స్ తోనే కాకుండా, గ్లామర్, డాన్స్ తోనూ ఇరగదీసింది. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా..  కృతి శెట్టి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 
 

ప్రస్తుతం యంగ్ స్టార్ నితిన్ (Nithiin) సరసన ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) చిత్రంలో నటిస్తోంది. నిన్నే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ముఖ్య అతిథులు హాజరై యూనిట్ కు బెస్ట్ విషెష్ తెలిపారు. ఈ సందర్భంగా బేబమ్మ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
 

తనకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయని.. అయినా ఇక్కడి నుంచి వెళ్లబోనని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. టాలీవుడ్ తనకు కావాల్సినవన్నీ ఇచ్చిందంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల సమయంలోనే తనకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు  వచ్చాయని తెలిపింది. కానీ రిజెక్ట్ చేసినట్టు  చెప్పింది. టాలీవుడ్ ను వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.
 

ఇక  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి బ్లాక్ శారీలో ఆకర్షణీయంగా మెరిసింది. ఈవెంట్  కు హాజరైన సినీ ప్రముఖులు, ఆడియెన్స్ చూపు బేబమ్మపైనే పడేలా చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించి ఈవెంట్ పిక్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. బేబమ్మ ఫ్యాన్స్ ఇంటర్నెట్ లో కావాల్సినంత సపోర్ట్ ఇవ్వడంతో కృతి క్రేజ్ అంతకంతకు పెరిగిపోతోంది.

హీరో నితిన్ (Nithiin) సరసన ‘మాచర్ల నియోజకవర్గం’లో  నటిస్తున్న కృతి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోబోతోంది. ఆగస్టు 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే  ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహించడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే కృతి తమిళంలో ‘సూర్య 44’ (Suriya 44)లోనూ నటిస్తోంది. 

click me!