రాంచరణ్ కి గాలం వేస్తున్న మాజీ ప్రపంచ సుందరి.. క్రేజీ కామెంట్స్

Published : Apr 23, 2024, 03:57 PM IST
రాంచరణ్ కి గాలం వేస్తున్న మాజీ ప్రపంచ సుందరి.. క్రేజీ కామెంట్స్

సారాంశం

తాజాగా మాజీ ప్రపంచ సుందరి, యంగ్ బ్యూటీ మానుషీ చిల్లర్ రాంచరణ్ గురించి క్రేజీ కామెంట్స్ చేసింది. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. రామరాజుగా రాంచరణ్ దేశం మొత్తాన్ని మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత చరణ్ బుచ్చిబాబు, సుకుమార్ లతో పాన్ ఇండియా చిత్రాలు చేయాల్సి ఉంది.

చరణ్ తో నటించాలని ఉన్నట్లు చాలా మంది నార్త్ హీరోయిన్లు తమ మనసులో మాట బయటపెడుతున్నారు. తాజాగా మాజీ ప్రపంచ సుందరి, యంగ్ బ్యూటీ మానుషీ చిల్లర్ రాంచరణ్ గురించి క్రేజీ కామెంట్స్ చేసింది. 

ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మానుషీ చిల్లర్.. రాంచరణ్ అంటే తనకి చాలా ఇష్టం అని మనసులో మాట బయట పెట్టింది. రాంచరణ్ తో కలసి నటించేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్నా. ఆయన డ్యాన్స్ అద్భుతంగా ఉంటుంది. రాంచరణ్ తో ఎప్పటికైనా నటించాలనేది తన కోరిక అని మానుషీ చిల్లర్ తెలిపింది. 

హీరోయిన్ గా మానుషీకి అంతగా కల్సి రావడం లేదు. కెరీర్ మొదటి నుంచి పరాజయాలే ఎదురవుతున్నాయి. రీసెంట్ గా నటించిన బడే మియా చోటే మియా చిత్రం నిరాశపరిచింది. ఈ చిత్రంలో మానుషీ తనకంటే వయసులో ఎంతో పెద్దవాడైన అక్షయ్ కుమార్ కి జోడిగా నటించడం పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి. 

కానీ మానుషీ మాత్రం వయసులో పెద్ద హీరోలతో నటించడానికి తనకి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని అంటోంది. అక్షయ్ కుమార్ తో నటించడాన్ని నేను బాగా ఎంజాయ్ చేశా. హీరో హీరోయిన్లుగా ఎవరిని తీసుకోవాలనేది దర్శకుడి నిర్ణయం. కాబట్టి ఇక్కడ వయసు గురించి చర్చ అనవసరం అని మానుషీ తెలిపింది. మానుషీ టాలీవుడ్ లో చివరగా వరుణ్ తేజ్ కి జోడిగా ఆపరేషన్ వాలెంటైన్ అనే చిత్రంలో నటించింది. ఆ మూవీ కూడా డిజాస్టర్. 

PREV
click me!

Recommended Stories

Bhooth Bangla: ఈ ఏడుగురు స్టార్స్ లో బాగా చదువుకుంది ఎవరో తెలుసా ? వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఇవే
Tabu Real Name: టబు అసలు పేరేంటి? తండ్రి ఇంటిపేరు ఎందుకు వాడరు? ఆయనంటే ఇష్టం లేకపోవడానికి కారణం ఇదే