చిరంజీవితో విజయశాంతి.. మూడు దశాబ్దాల తర్వాత మరోసారి?.. ఫ్యాన్స్ కి పండగే

By Aithagoni RajuFirst Published Apr 23, 2024, 6:54 PM IST
Highlights

చిరంజీవి, విజయశాంతి కలిసి దాదాపు ఇరవై సినిమాల్లో నటించి మెప్పించారు. మోస్ట్ సక్సెస్ పుల్‌ పెయిర్‌గా నిలిచింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మరోసారి ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారట. 
 

మెగాస్టార్‌ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్‌ విజయశాంతి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అనేక బ్లాక్‌ బస్టర్స్ వచ్చాయి. దాదాపు 20కి పైగా చిత్రాలు వచ్చినట్టు ఈ ఇద్దరే ఆ మధ్య ఓ ఈవెంట్లో తెలిపారు. ఓ టైమ్‌ తర్వాత విజయశాంతి.. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు షిఫ్ట్ అయ్యింది. దీంతో పెద్ద హీరోల సరసన సినిమాలు చేయలేదు. ఆ తర్వాత సినిమాలకే దూరమైంది విజయశాంతి. చాలా ఏళ్ల తర్వాత ఆ మధ్య `సరిలేరు నీకెవ్వరు`లో కీలక పాత్రలో మెరిసింది. దీంతో మళ్లీ ఆమె సినిమాలు చేస్తుందని భావించినా, అలా జరగలేదు. 

ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ ఆమె మేకప్‌ వేసుకోబోతుందట. అది చిరంజీవి కోసమని తెలుస్తుంది. చిరంజీవితో కలిసి నటించబోతుందట. దాదాపు 30ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరు జోడీ కట్టబోతున్నట్టు తెలుస్తుంది. `విశ్వంభర`లో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. ఓ ముఖ్యమైన పాత్రకి ఆమెని అడుగుతున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మరి విజయశాంతి ఓకే చెబుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. వీరితోపాటు మీనాక్షి చౌదరి, సురభి వంటి భామలు ఆయనకు చెళ్లేళ్లుగా కనిపిస్తారట. నవీన్‌ చంద్ర కూడా నటిస్తున్నట్టు సమాచారం. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. సోషియో ఫాంటసీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. హనుమాన్‌ చుట్టూ కథ సాగుతుందని సమాచారం. 

ఇదిలా ఉంటే చిరంజీవి, విజయశాంతిలది టాలీవుడ్‌లో హిట్‌ పెయిర్‌గా నిలిచింది. అంతేకాదు డాన్సుల్లోనూ ఈ ఇద్దరిని కొట్టేవాళ్లే లేరంటారు. ఇద్దరు కలిసి డాన్సు చేస్తే కనువిందులా ఉంటుందనే టాక్‌ ఉంది. ఇక చిరంజీవి, విజయశాంతి కలిసి `పసివాడి ప్రాణం`, `స్వయంకృషి`, `అత్తకు యముడు అమ్మాయికి మొగుడు`, `కొండవీటి రాజా`, `గ్యాంగ్ లీడర్‌`, `కొండవీటి దొంగ`, `స్టూవర్ట్ పురం పోలీస్‌ స్టేషన్‌`, `రుద్రవీణ`, `యముడికి మొగుడు`, `సంఘర్షణ`, `మహనగరంలో మాయగాడు`, `దేవాంతకుడు`, `యుద్ధభూమి`, `చణక్య శపథం`, `ధైర్యవంతుడు`, `మంచిదొంగ`, `ఛాలెంజ్‌`, `చిరంజీవి`, `మెకానిక్ అల్లుడు` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరు తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.
 

click me!