20 కేజీలు బరువు తగ్గడానికి ఖుష్బూ ఇంజెక్షన్ తీసుకున్నారా? నెటిజన్ ప్రశ్నకు నటి ఘాటు రిప్లై

Published : Apr 20, 2025, 11:34 AM IST

స్టార్ నటి, మాజీ హీరోయిన్  ఖుష్బూ సుందర్ 20 కేజీలు బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు.  సోషల్ మీడియాలో ఆమె  ఫోటోలు వైరల్ అయ్యాయి. బరువు తగ్గడానికి ఆమె  ఇంజెక్షన్ తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల్లో నిజం ఎంత? వాటిని ఖుష్బూ ఎలా ఫేస్ చేశారు? 

PREV
16
20 కేజీలు బరువు తగ్గడానికి  ఖుష్బూ ఇంజెక్షన్ తీసుకున్నారా? నెటిజన్ ప్రశ్నకు నటి ఘాటు రిప్లై

సౌత్ సినిమాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది కుష్బూ సుందర్. తెలుగు, కన్నడ,  తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా రాణించిన ఈ తార.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ.. ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఆమె రీసెంట్ గా  20 కేజీలు బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు. ఖుష్బూ బరువు తగ్గిన తరువాతి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read:  40 సినిమాలు ప్లాప్.. 33 రిలీజ్ కాలేదు.. అయినా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరు?
 

26

54 ఏళ్ల ఖుష్బూ సుందర్ కరోనా సమయంలో వర్కవుట్స్ ఎక్కువగా చేవారు. అప్పుడు ఆమె బరువు 93 కేజీలు. పట్టుదలతో వర్కౌట్ చేసిన ఆమె.. తొమ్మిది నెలల్లోనే ఇంత బరువు తగ్గారు. ఈ విషయాన్ని ఓ పేమస్  యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ   చెప్పారు. బరువు వల్ల కీళ్ల నొప్పులు వచ్చేవని, ఇప్పుడు తగ్గాయని అన్నారు.

Also Read: 5 సార్లు రీ రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా? మరీ ఇంత తక్కువ కలెక్ట్ చేసిందా?

36
khushbu sundar

ఇక ఈ విషయంలో ఖుష్బూని అభినందిస్తూ చాలామంది కామెంట్లు పెట్టారు. అయితే పాజిటీవ్ కామెంట్స్ తో పాటు కొన్ని నెగెటీవ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అందులో  ఓ నెటిజన్ చేసిన  నెగిటివ్ కామెంట్‌కి ఖుష్బూ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఇచ్చే మౌంజారో ఇంజెక్షన్ తీసుకున్నారని, అందుకే ఇలా బరువు తగ్గారని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. 'ఇది మౌంజారో ఇంజెక్షన్ మ్యాజిక్. మీ ఫాలోవర్స్‌కి కూడా చెప్పండి. వాళ్లు కూడా తీసుకుంటారు' అని ఎక్స్ ప్లాట్‌ఫాంలో కామెంట్ చేశారు.

Also Read: మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

46
khushbu sundar

ఇక ఈ కామెంట్ కు  ఖుష్బూ సమాధానం ఇస్తూ.. 'మీలాంటి వాళ్లు చాలా తలనొప్పి. మీరు మీ ముఖం చూపించరు. ఎందుకంటే లోపల మీరు ఎంత చెత్తో మీకు తెలుసు. మీ తల్లిదండ్రుల మీద జాలి వేస్తోంది అని ఆమె  సమాధానం ఇచ్చారు. బరువు తగ్గించుకోవడం కోసం ఖుష్బూ  ఎంతో కష్టపడుతున్నారు. ఖుష్బూ ఎక్కువ వర్కవుట్ చేయడం వల్ల వల్ల కండరాల అలెర్జీకి గురై చికిత్స తీసుకుంటున్నారట. 

Also Read: 40,000 కు ఇంటిని తాకట్టు పెట్టి, ఎన్టీఆర్ తో సినిమా చేసిన స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా?

56

అయితే ఈ కండరాల అలెర్జీ సాధారణంగా క్రీడాకారులకు వస్తుంది. ఎందుకంటే వాళ్లు ఎక్కువ వ్యాయామం చేస్తారు. నటీమణులు అంత వ్యాయామం చేయరు. కాని ఖుష్బూ ఎక్కువ వర్కౌట్స్ చేయడం వల్ల ఇది వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. దాంతో ఇంత స్లిమ్ అయినా కూడా ఖుష్బూ సంతోషంగా ఉండలేకపోతున్నారు. బరువు తగ్గి.. స్లిమ్ కావాలని కష్టపడితే.. ఇలా అయ్యిందని ఆమె బాధపడుతున్నారు.  ఆరోగ్యం పోయిందని అంటున్నారు.

Also Read: బిగ్ బాస్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్, ఈసారి సీజన్ లేనట్టే, కారణం ఏంటో తెలుసా?

66

తమిళంలో స్టార్ హీరోల సరసన నటించిన ఖుష్బూ .. తెలుగులో వెంకటేష్, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్ లాంటి స్టార్స్ తోసందడి చేశారు. చిరంజీవికి మాత్రం స్టాలిన్ సినిమాలో అక్క పాత్రలో కనిపించారు. ఇక తెలుగు కామెడీ షో జబర్ధస్త్ కు జడ్జిగా కూడా వ్యవహరించారు ఖుష్బూ . ఇక ఆమెకు తమిళనాడులో ఓ అభిమాని గుడి కూడా కట్టాడంటే ఖుష్బూ  క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవాచ్చు. 

Also Read:  జూనియర్ ఎన్టీఆర్ మామ కి హైడ్రా షాక్, పిల్లాడి లేఖతో నార్నె గుట్టు రట్టు?

Read more Photos on
click me!

Recommended Stories