ల్యాండ్ గ్రాబింగ్ కేసున్నట్టు అక్కడ బోర్డులుంటుండగానే.. మరోవైపు అక్కడ ప్లాట్ల కొనుగోలుకు సంప్రదించాల్సిన ఫోను నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేసింది నార్నే ఎస్టేట్స్ సంస్థ. అనుమతిలేని లే ఔట్తో రహదారులు నిర్మిస్తూ.. ప్లాట్లు అమ్మకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
హాఫీజ్ పేట్, రాయదుర్గం ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బోర్డు లు పెట్టారు హైడ్రా అధికారులు. ఆక్రమించుకున్న వారిపై కేసులు కూడా నమోదు చేశారు. నార్నె ఎస్టేట్స్ కు యజమాని నార్నే శ్రీనివాసరావు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతీ తండ్రి. ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థనే భూముల్ని కబ్జా చేసినట్లుగా హైడ్రా చెబుతోంది.
రాయదుర్గం ఏరియాలో నార్నే పేరుతో ఓ రోడ్ ఉంటుంది. ఆ ఏరియాలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ భూములు కబ్జాలని హైడ్రా చెబుతోంది. ఈ కూల్చివేతలపై నార్నే గ్రూపు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
Also Read: మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?