రెండో వారంలో ‘కార్తికేయ 2’వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవ్వాళ రేపు శని, ఆదివారాలు కావడంతో ఈ రెండు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టనుందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేటి కలెక్షన్లు కలుపుకొని రూ.70 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మరోవైపు యూఎస్ఏలోనూ అదిరిపోయే కలెక్షన్స్ ను సాధించింది. మూడు రోజుల్లోనే రూ.4 లక్షల డాలర్స్ ను సాధించింది. మొన్నటి వరకు 700కే డాలర్స్ ను సాధించి తెలుగు సినిమా సత్తాను చాటింది.