Karthika Deepam: చారుశీలను సహాయం కోరిన దీప.. కోపంతో రగిలిపోతున్న కార్తీక్?

First Published Jan 2, 2023, 8:56 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 2వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్, దీప వైపు చూస్తూ నువ్వు నా ఇంటి దీపానివి, నా ప్రాణానివి దీప అలాంటిది ఆ దేవుడు ఈ దీపాన్ని అర్పేయాలని చూస్తున్నాడు ఎలా అయినా నేను కాపాడుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు కార్తిక్. అప్పుడు దీప దేవుడికి మొక్కుకుంటూ ఏ జన్మలో చేసిన పాపమో నాకు ఇలాంటి శిక్ష వేశావు కానీ నేను దాని గురించి ఆలోచించడం లేదు నా భర్త పిల్లలు చల్లగా ఉండేది చూడు స్వామి అనుకుంటూ ఉంటుంది. డాక్టర్ బాబు మనసు మారి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్లేలా ఒక దారి చూపించు అని అంటుంది దీప. ఇంతలో చారుశీల అక్కడికి రావడంతో నీ గురించి అనుకుంటున్నాను ఇంతలో నువ్వే వచ్చావు లోపలికి వెళ్దాం రా నీకు ఒక విషయం చెప్పాలి అని లోపలికి పిలుచుకుని వెళుతుంది దీప.
 

ఇప్పుడు చారుశీల ఒక్క నిమిషం ఒక్క అని దేవుడికి దండం పెడుతూ నాకు కార్తీక్ పెళ్లి గురించి అడిగేలా ఉంది ఆ వార్త నిజమైన చూడు స్వామి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ని పట్టించుకోకుండా లోపలికి వెళ్తుండడంతో మా అక్క చెల్లెల మధ్య లక్ష్య మాటలు ఉంటాయి అనడంతో అవును బావ అంటూ వరుసలు కలుపుతుంది చారుశీల. అప్పుడు పండరీ, కార్తీక్ మాట్లాడుకుంటూ చారుశీల అసలు నిజ స్వరూపం తెలియక చారుశీల గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు హేమచంద్రతో సౌర్య మాట్లాడుతూ అమ్మానాన్నల కోసం అప్పటి నుంచి నేను వాళ్లకోసం వెతుకుతూనే ఉన్నాను అంకుల్ అని తన బాధలు మొత్తం చూపుకుంటూ ఉంటుంది. అప్పుడు హేమచంద్ర తన మనసులో వాళ్ళు మిమ్మల్ని ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు కానీ మీ ముందుకు రావడం లేదు అంతే అనుకుంటూ ఉంటాడు.
 

అప్పుడు సౌర్య అంకుల్ మీకు చారుశీల డాక్టర్ తెలుసా ఆమె వాళ్ళ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ కూడా పోస్టర్లు అతికించాను అని చెబుతుంది శౌర్య. నాతో పాటు మా అమ్మ నాన్నలను వెతకడానికి నాకు హెల్ప్ చేస్తారా ఇప్పుడే కాదు మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వెళ్లి వెతుకుతాము ఆడటంతో సరే అని అంటాడు హేమచంద్ర. అప్పుడు హేమచంద్ర ఫోటో తీసుకుంటుండగా నా ఫోటో కాదు మా అమ్మ నాన్నల ఫోటో మా నానమ్మ ఫోన్ నుంచి పెడతాను అనడంతో మీ నానమ్మ ఆల్రెడీ ఫోటో ఇచ్చింది కానీ మీ అమ్మ వాళ్ళు కనిపిస్తే నేను వాళ్లకు నీ ఫోటో చూపించాలి కదా వాళ్లు నమ్మకపోతే ఎలా అని అనడంతో సరే అంకుల్ ఇద్దరు సెల్ఫీ తీసుకుందాము అని వాళ్ళిద్దరూ కలిసి సెల్ఫీ తీసుకుంటారు. మరొకవైపు దీప,చారుశీలను లోపలికి పిలుచుకొని వెళ్తుంది.
 

 అప్పుడు చారుశీల ఏంటి దీప కార్తీక్ కి మరొక పెళ్లి చేయమని నన్ను అడుగుతుంది అనుకుంటే వాళ్ళ అమ్మానాన్నలతో కలపమని అడుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది. మరి నేనేం కావాలి కార్తీక్ మీద నేను పెట్టుకున్న ఆశలేం కావాలి అనుకుంటూ ఉంటుంది. చాలు ఆపు చారుశీల మీరిద్దరూ కలిసి నా ప్రాణాలకు హాని ఉంటే కార్తీక్ బాబు ప్రాణాలకు హాని ఉందని అబద్ధాలు చెబుతారా ఇది మీకు న్యాయమైనా అనడంతో అమ్మయ్య నిజం తెలిసిపోయింది అని సంతోషపడుతూ ఉంటుంది చారుశీల. అప్పుడు నాకు కావాల్సింది అదే దీపక్క నువ్వు పోవాలి కార్తీక్ ఉండాలి. కార్తీక్ నా వాడు కావాలి నేను ఎలాగైనా కార్తీక్ పెళ్లి చేసుకుని ఆస్తి దక్కించుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
 

నేను లేకపోతే డాక్టర్ బాబు ఏమైపోతారా అసలు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో నాకు భయంగా ఉంది ఎలా అయినా డాక్టర్ బాబుని వాళ్ళ అమ్మానాన్నలకు పంపిస్తాను అని నాకు మాట ఇవ్వు చారుశీల అని చారుశీల అని అనడంతో చారుశీల షాక్ అయ్యి దీప వైపు అలాగే చూస్తుండగా దీప చారుశీల తో మాట తీసుకుంటుంది. మాట ఇచ్చావు నువ్వు చేస్తున్నావు అంతే అని అంటుంది దీప. మరొకవైపు చంద్రమ్మ పని చేసుకుంటూ ఉండగా ఇంతలో ఇంద్రుడు అక్కడికి వచ్చి కాఫీ ఇవ్వమని అడగడంతో నేను వంట చేయాలి అని అంటుంది. అప్పుడు వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వారిద్దరూ దీప కార్తీక్ లో ఆడుతున్న నాటకాన్ని బయటపెడితే బాగుంటుందని అనిపిస్తుంది కానీ చెప్పలేక ఆగిపోతున్నాను అని అంటుంది చంద్రమ్మ.
 

అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే హిమ అక్కడికి రావడంతో అది చూసి చంద్రమ్మ దంపతులు షాక్ అవుతారు. అప్పుడు హిమ అక్కడికి వచ్చి సారీ బాబాయ్ సారీ పిన్ని ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర నేను కావాలని ఎలా చేయలేదు నేను ఏదో బాధలో ఉన్నాను అనడంతో చంద్రమ్మ దంపతులు ఊపిరి పీల్చుకుంటారు. మీరు మా సౌర్యని బాగా చూసుకున్నారు మీరంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది హిమ. అప్పుడు ఇంద్రుడు బాధపడకు హిమ నువ్వు సౌర్య కలిసేలా నేను చేస్తాను అని అంటాడు. దాంతో హిమ సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత దీప, పండరి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి కోపంగా వస్తాడు. అప్పుడు పండరిని బయటికి వెళ్ళమని చెబుతాడు కార్తీక్.
 

అప్పుడు కార్తీక్ కోప్పడుతూ ఒక్కసారి చెబితే నీకు అర్థం కాదా ఎన్నిసార్లు చెప్పాలి అని అంటాడు. ఎక్కడికి వెళ్లినా నీతో పాటే వస్తానని చెప్పాను కదా మరి చారుశీలతో అలా ఎందుకు మాట్లాడావు అని అంటాడు. అసలు నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను అనుకున్నావు అనడంతో అదిగో మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు అని దీప అనగా ఇదే మాట 100 సార్లు అంటాను అని అంటాడు కార్తీక్. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఎంతలో చారుశీల వారి మాటలు విని నవ్వుకుంటూ ఉంటుంది. నువ్వు సూపర్ కార్తీక్ నువ్వు మీ అమ్మని నాన్నల దగ్గరికి వెళ్ళను అన్న మాట మీదే ఉండాలి అప్పుడు దీపక్క నాకు ఇచ్చి పెళ్లి చేసేలా మనసు మార్చుకునేలా నేను చేస్తాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వారిద్దరు వాదించుకుంటూ ఉండగా ఇంతలోనే హేమచంద్ర కార్తిక్ కి సౌర్యతో కలిసి దిగిన సెల్ఫీని పంపిస్తాడు.

ఆ ఫోటోని చూసి దీప, కార్తీక్ సంతోష పడుతూ ఉండగా మరి కూతురు మీద ఇంత ప్రేమ ఉన్నవాడివి ఎందుకు వెళ్లలేదు డాక్టర్ బాబు అనడంతో నువ్వు నా భార్యవి అని దీపని హద్దుకుంటాడు కార్తీక్. అది చూసి చారుశీల కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు హిమ  జరిగిన విషయాల గురించి ఆనందరావుతో చెప్పుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉండగా అప్పుడు ఆనంద్ రావ్ హిమని ఓదారుస్తాడు. మరొకవైపు శౌర్య బాధపడుతూ ఉండగా ఇంద్రుడు అక్కడికి వెళ్లి ఎన్నాళ్ళని ఇలా ఉంటావో సౌర్యమ్మ అని హిమని సౌర్యని ఒకటి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.  అప్పుడు హిమ గురించి మంచి మాటలు చెబుతూ ఉంటాడు ఇంద్రుడు. కానీ సౌర్య మాత్రం ఎప్పటికీ ఆ హిమను క్షమించను దాంతో మాట్లాడను అని కోపంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా జరుగుతుందని నాకు తెలియదు కదా తాతయ్య  నాకు తెలిసి ఉంటే నేను అలా చేసేదాన్నా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద్ రావు ఓదారుస్తూ ఉంటాడు.

click me!