మిల్క్ ఫెడరేషన్‌ ఎగ్జామ్‌లో `కాంతార` ప్రశ్న.. ఎగ్జామ్‌ పేపర్‌ షేర్‌ చేసిన హీరోయిన్‌.. వైరల్‌

Published : Dec 20, 2022, 09:14 PM IST

కన్నడ నుంచి వచ్చిన మరో సంచలనం `కాంతార`. `కేజీఎఫ్‌` తర్వాత ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన చిత్రమిది. తాజాగా ఈ సినిమా పబ్లిక్‌ ఎగ్జామ్‌లో ప్రశ్నగా రావడం మరింత హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
15
మిల్క్ ఫెడరేషన్‌ ఎగ్జామ్‌లో `కాంతార` ప్రశ్న.. ఎగ్జామ్‌ పేపర్‌ షేర్‌ చేసిన హీరోయిన్‌.. వైరల్‌

`కాంతార`(Kantara) చిత్రం కన్నడ చిత్ర పరిశ్రమనే కాదు, ఇండియన్‌ సినిమాని ఓ ఊపు ఊపింది. కేవలం 18కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.450కోట్ల వరకు కలెక్ట్ చేసింది. నెమ్మదిగా పుంజుకుని సంచలనాలు క్రియేట్‌ చేసింది. ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. ఫిల్మ్ మేకర్స్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది అనేక పురస్కారాలను అందుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమని మరో మెట్టు ఎక్కింది. 
 

25

`కాంతార` చిత్రం హవా ఇంకా కొనసాగుతుంది. ఓటీటీలోనూ సత్తా చాటుతుంది. అదే సమయంలో ఆడియెన్స్ నుంచి, ఫిల్మ్ మేకర్స్ లోనూ చర్చనీయాంశంగా మారుతుంది. అయితే తాజాగా ఈ సినిమా పబ్లిక్‌ ఎగ్జామ్స్ లోనూ ప్రశ్నగా మారడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. కన్నడ ప్రభుత్వ ఎగ్జామ్స్ లో ఓ ప్రశ్న `కాంతార` చిత్రం నుంచి వచ్చింది. కర్నాటక మిల్క్ ఫెడరేషన్‌ ఎగ్జామ్‌ పేపర్‌లో ఈ సినిమా నుంచి ప్రశ్ని వచ్చింది. 

35

ఇందులో `ఇటీవల విడుదలైన కాంతార చిత్రం దేని ఆధారంగా తెరకెక్కింది` అని ప్రశ్నించారు. దీనికి నాలుగు ఆప్షన్లుగా `జల్లికట్టు, భూత కోలా, యక్షగాన, దమ్మమి అనే ఆప్షన్లు ఇచ్చారు. క్వచ్ఛన్‌ పేపర్‌లోని ఈ ప్రశ్న క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది చూసిన హీరోయిన్ సప్తమి గౌడ ఈ పేపర్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. బెస్ట్ పార్ట్ ఆఫ్‌ ది క్వచ్ఛన్‌ పేపర్‌` అని పేర్కొంది. దీంతో అది మరింత వైరల్‌ అవుతుంది. 

45

ఇక `కాంతార` విషయానికి వస్తే.. బలమైన కంటెంట్‌ ఉంటే భాషకు అతీతంగా సినిమాని ఆదరిస్తారని మరోసారి నిరూపించింది. ఇందులో దర్శకుడు, నటుడు రిషబ్‌ శెట్టి హీరోగా నటించడంతోపాటు సినిమాకి దర్శకత్వం వహించారు. సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. `కేజీఎఫ్‌`ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మించడం విశేషం. కన్నడ సాంప్రదాయ పండగ భూత కోల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్లైమాక్స్ సినిమాకి మెయిన్‌ హైలైట్‌గా నిలిచింది. 

55

ఇప్పటికే ఈ చిత్రం భారీ కలెక్షన్లతోపాటు ఐఎండీబీ టాప్‌ 10 అవార్డుని అందుకుంది. మున్ముందు మరిన్ని అవార్డులు అందుకోబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రంతో దర్శకుడు రిషబ్‌ శెట్టికి భారీ ఆఫర్లు వస్తున్నాయి. టాప్‌ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయారు. నటుడిగానూ ఆయన పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోవడం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories