హైపర్ ఆదిని తొక్కేయాలనే ఉద్దేశం లేదు..ఆ టైంలో జరిగింది ఇదే, అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు

First Published Apr 28, 2024, 9:14 PM IST

బుల్లితెరపై సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న హైపర్ ఆది ప్రస్తుతం సినిమాల్లో సైతం రాణిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూ నటనపై ఆసక్తి ఉండడంతో హైపర్ ఆది ఇటు వైపు వచ్చాడు.

బుల్లితెరపై సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న హైపర్ ఆది ప్రస్తుతం సినిమాల్లో సైతం రాణిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూ నటనపై ఆసక్తి ఉండడంతో హైపర్ ఆది ఇటు వైపు వచ్చాడు. కుటుంబం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా జాబ్ మానేసి రిస్క్ చేసి వచ్చాడు. కానీ ఊహించని విధంగా సక్సెస్ అయ్యాడు. 

హైపర్ ఆది ఎదుగుదలలో అదిరే అభి పాత్ర ఎంతైనా ఉంది. ఎందుకంటే హైపర్ ఆదికి మొదట అవకాశం ఇచ్చింది అదిరే అభినే. తాజాగా ఇంటర్వ్యూలో హైపర్ ఆదిగురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను జబర్దస్త్ లో కెరీర్ మొదలు పెట్టినప్పుడు జాబ్ కూడా చేస్తూనే ఉన్నా. 

హైపర్ ఆది పేస్ బుక్ లో ఒక మెసేజ్ పెట్టాడు. తాను చేసిన షార్ట్ ఫిలిం పోస్ట్ చేసి అన్నా ఒక్కసారి చూడండి అని రిక్వస్ట్ చేసాడు. నాకు టైం ఉన్నప్పుడు చూశాను. బావుంది అనిపించింది. దీనితో కమ్ అండ్ మీట్ మి అని రిప్లై ఇచ్చా. నన్ను కలిశాడు. అప్పడు నాతో కొన్ని జోక్స్ షేర్ చేసుకున్నాడు. అవి కూడా బావున్నాయి. ఆ తర్వాత నన్ను రెగ్యులర్ గా కలుస్తూ.. స్కిట్ లలో జోక్స్ కి  ఐడియాలు ఇచ్చేవాడు. 

నెమ్మదిగా కొన్ని జోక్స్ రాసి తీసుకురా అని చెప్పా. ఎంకరేజ్ చేస్తూ ఉండగా నెమ్మదిగా కంప్లీట్ స్కిట్ రాసే స్టేజికి చేరుకున్నాడు. ఆ తర్వాత నా టీంలోకి తీసుకున్నా. బాగా పాపులర్ అయ్యాడు. 

కొన్ని రోజుల తర్వాత హైపర్ ఆదిని టీం లీడర్ గా పెట్టి కొత్త టీం క్రియేట్ చేస్తే బావుంటుంది అని డైరెక్టర్స్ చెప్పారు. హైపర్ ఆది అడుగుతున్నప్పుడు వెనక్కి లాగాలని కానీ, తొక్కేయాలని కానీ నాకు ఏమాత్రం ఉద్దేశం లేదు. ఒకరు ఎదుగుతునప్పుడు వీలైతే సపోర్ట్ చేయాలి కానీ వెనక్కి లాగకూడదు. నేను సపోర్ట్ చేయడానికే ప్రయత్నించా. 

హైపర్ ఆదికి మంచి ట్యాలెంట్ ఉంది. అందులో సందేహం లేదు. నాకు వీలైనంత సపోర్ట్ ఇచ్చా. నావల్లే హైపర్ ఆది ఈ స్టేజిలో ఉన్నాడు అని నేను చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. తనకు ఉన్న ప్రతిభ న దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా బాగా షైన్ అయ్యాడు అని అదిరే అభి అన్నారు. 

సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురికి మంచి ట్యాలెంట్ ఉంది. కానీ వీరు సపరేట్ టీం లీడర్లుగా రాణించలేదు. ముగ్గురూ కలసి ఉన్నప్పుడే సక్సెస్ అయ్యారు. వల్ల పరిస్థితి వేరు. వాళ్ళు కలసి ఉంటేనే అది స్ట్రెంత్ అని అదిరే అభి అన్నారు. 

click me!